ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వేటగాడి కొడుకు : ఇతర విదేశ కథలు , పుస్తకం ధర : 60 (కొరియర్ ఛార్జెస్ అదనం) సంప్రదించాల్సిన నెంబర్: 9908284105 ( కాల్స్ అండ్ వాట్సాప్ ). * * * * 'ఎల్లలు లేని కథాప్రపంచం ' * * * * ఈ పుస్తకం లోని పన్నెండు దేశాలకు చెందిన కథలు , పన్నెండు ఆణిముత్యాలు . వేలసంవత్సరాలు తరబడి ప్రపంచం మంతటా ఈ కథల్ని కోట్లాది పిలల్లు విన్నారు , చదివారు , ప్రేరణ పొందారు.ఏమిటి వ్యత్యాసం మన దేశం కథలకూ , విదేశాల కథలకూ ? భూమండలం లో ఏ సాహిత్యంలోనైనా కథలు కథలే ! నేల నింగి నీరు నిప్పు గాలి అంతటా ఒక్క తీరున ఉన్నట్టే కథలూ అలాగే ! రచయితలు మనిషి మనస్తత్వం , ఆలోచన , ప్రవర్తన , చమత్కారాల్ని చిత్రిస్తారు.జీవితం తాలూకు మంచి చెడు , సుఖం దుఃఖం , ఆశ నిరాశ గెలుపు ఓటమిలను ఆవిష్కరిస్తారు.వస్తువుకు సరితూగే రచన వైచిత్రి ప్రదర్శిస్తారు.ప్రతిదేశమూ కథలకు కాణాచే ! చుడండి ; గ్రీసుదేశం కథలో సామాన్యురాలైన యువతి ఒక రాజునే ఎదిరించి కార్యసాధకుడైన వేటగాడి కొడుకుని పెళ్లాడుతుంది.ఈ వేటగాడి కొడుకు అసలుసిసలైన మన తోటరాముడే ! సౌదీ అరేబియా కథలో మనుషుల్నే కాదు మహారాజుల్ని సైతం ఆటపట్టించే హాస్యగాడు అబున్ వాన్ అపర తెలివి రామకృష్ణుడే ! గ్రేట్ బ్రిటిన్ కథలో రాజు గారి మూడు వింత ప్రశ్నలకు కళ్ళుతిరిగే జవాబు చెప్పిన యాదవ అచ్చ తెలుగు గ్రామీణుడే ! ఇండోనేషియా కథలో పొరబాటున సున్నపు గోతిలో పడిపోయి బుద్ధిబలంతో బయటపడిన చిట్టెలుక , ఫిలిప్పీన్ కథలో జిత్తులమారి కోతిని బోల్తా కొట్టించిన తాబేలు , సోవియెట్ యూనియన్ కథలో మాయదారి మనిషిని సహృదయం తో మన్నించిన పాము మన పంచతంత్రం కథలే ! ఇలా ఈ విదేశీ కథలన్నింటా మానవ జీవితం ప్రతిబింబిస్తుంది.ఇవి బడిపిల్లలను ఉహాజగత్తులోకి తీసుకెళ్తాయి.భావుకతను సృజనాత్మకతను పెంపొందిస్తాయి.ప్రాపంచిక దృక్పథాన్ని కల్పిస్తాయి. -- డా. సాకం నాగరాజ ,
June 23, 2020 • T. VEDANTA SURY • Book Review