ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వైద్యశాల---ఒకానొకప్పుడు ఆస్పత్రులు మతంతో ముడిపడి ఉండేవని చదివానెక్కడో ఎప్పుడో. ఈజిప్టులో ప్రార్థనా మందిరాలలో వైద్యం అందించినట్లు చరిత్రలో నమోదైన మాట. గ్రీకు ప్రార్థనా మందిరాలలో దేవుడు కలలో కనిపించిన తర్వాత రోగులకు చికిత్స చేసే వారట.రోములోనూ దేవుడిపేరుతోనే వైద్యమందించేవారు.మద్రాసు విషయానికొస్తే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద ఆస్పత్రి అనే రికార్డు కూడా ఉండేది. మన భారతదేశంలో తొలి ప్రభుత్వ ఆస్పత్రిగా చరిత్రపుటలకెక్కింది. ఇంగ్లండ్ నుంచి మన దేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ వారికి వైద్యసహాయం చేయడంకోసం ఈ ఆస్పత్రి 1664 నవంబర్ 14 వ తేదీన ప్రారంభమైంది. మొదట్లో ఓ ఇరవై అయిదేళ్ళపాటు సెయింట్ జార్జ్ కోట ఆవరణలో ఉండేదీ ఆస్పత్రి. అంచెలంచెలుగా సకల సౌకర్యాలతో వృద్ధి చెందుతూ వచ్చిన ఈ ఆస్పత్రికోసం అప్పటి గవర్నర్ ఎలిహూ యేల్ (1649 - 1721) సూచన మేరకు 1690 లో కోటలోనే మరొకచోటకు మార్చబడింది. ఈ ఆస్పత్రి అభివృద్ధికోసం ఆయన ఎంతో కృషి చేశారు.ఆంగ్లేయులు - ఫ్రెంచ్ సైనికుల మధ్య జరిగిన యుద్ధానంతరం ఇరవై ఏళ్ళకు 1772లో ఇప్పుడున్న చోటుకి ఆ ఆస్పత్రిని మార్చారు.2001లో ఈ ఆస్పత్రిని ఏడు అంతస్తుల ఆస్పత్రిగా పునర్నిర్మించడానికి 2001మార్చి ఏడో తేదీన అప్పటి ముఖ్యముత్రి కరుణానిధి పునాదిరాయి వేశారు. ఆ తర్వాత 2005లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత 2005లో ఈ కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేశారు. 2013 నాటి లెక్కల ప్రకారం రోజుకి పది వేల మందికిపైగా రోగులు ఈ ఆస్పత్రికి వచ్చేవారు.ఈ ప్రభుత్వ అస్పత్రికి మొట్టమొదటి కార్యనిర్వాహకుడు సర్ ఎడ్వర్డ్ వింటర్. ప్రారంభంలో ఓ సొధారణ ఆస్పత్రి స్థాయిలోనే ఉండేది.ఇక మద్రాసు నగరంలో రెండో ప్రభుత్వ ఆస్పత్రి రాయపేట ప్రభుత్వ ఆస్పత్రి. 1911లో నెలకొల్పిన ఈ ఆస్పత్రిలో ఘడు వందలకుపైగా పడకలున్నాయి. వైద్య విద్యా శాఖ డైరెక్టరేట్ పరిధిలో పని చేస్తుందీ ఆస్పత్రి. ఈ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్సకోసం నూట డెబ్బై మిలియన్ల రూపాయలతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోనే ప్రభుత్వ హయాంలో క్యాన్సర్ రోగుల కోసం ఈ ఆస్పత్రిలో ప్రత్యేకించి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలో రాజీవ్ గాంధీ ఆస్పత్రి తర్వాత ఇది రెండవది. 2011 లో ఈ ఆస్పత్రి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ ఆస్పత్రిలో మరో రెండంతస్తులు నిర్మించ డానికి కేంద్ర ప్రభుత్వం 43.5 మిలియన్ల రూపాయలు కేటాయించిందిమద్రాసులోని పురాతన ఆస్పత్రులలోచెప్పుకోవలసింది స్టాన్లీ ఆస్పత్రి.ముఖ్యంగా ఉత్తర మద్రాస్ వారికోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రి ఇది. రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆస్పత్రిని పదిహేడో శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీవారు మన దేశానికి వచ్చిన తర్వాత నిర్మించారు. ఆ రోజుల్లో జార్జిటౌన్ పరిధిలోని ప్రజలే ఎక్కువగా ఈ ఆస్పత్రికి వచ్చేవారు.సెయింట్ జార్జ్ కోట ఆవరణలోని వారికి అక్కడి ఆస్పత్రి ఉపయోగపడుతుండగా చెన్నైలోని ఇతర ప్రాంతాలవారికి ఆధునిక వైద్యులు ఉండేవారు కారు. ఎక్కడికక్కడ చిన్న చిన్న డాక్టర్లు వైద్యం చేసేవారు. దాంతో ఆధునిక వైద్యుల ఆవసరం కావాల్సివచ్చింది. ఈ క్రమంలోనే స్టాన్లీ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలోనే నా మిత్రుడు శ్రీనివాస్ చదువుకుని డాక్టరయ్యాడు.నిజానికి 1740లో ఈ ఆస్పత్రి ఏర్పడినప్పటికీ 1938లోనే కొలేజీ ప్రారంభమైంది.1782 ప్రాంతంలో యుద్ధంలో గాయపడిన వారికి గంజి ఇవ్వడం కోసం మణియక్కారర్ అనే వ్యక్తి ఓ సత్రాన్ని ఏర్పాటు చేశాడు.అయితే ఆంగ్లేయులు మణియక్కారర్ అనే మాటను మోనికర్ అని పలికడంతో ఆ సత్రాన్ని మోనికర్ సత్రంగా చెప్పేవారు.1799 లో జాన్ అండర్ ఉడ్అనే వైద్యుడు ఆ సత్రంలోనే ఓ ఆస్పత్రిని ప్రారంభించాడు.దాంతో ఈ సత్రాన్ని గంజిత్తొట్టి ఆస్పత్రి అనేవాళ్ళు.1808 లో అప్పటి పాలకులు సత్రంతోపాటు ఆస్పత్రినీ నడపసాగారు.1910లో ఇది పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకొచ్చింది. అప్పటి నుంచి రాయపురం ఆస్పత్రి అనే పిలిచేవారు. జార్జ్ ఫెడ్రిక్ స్టాన్లీ అనే అతను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉండేవారు. ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ అయిదేళ్ళ వైద్య విద్యకోసం తరగతులు ప్రారంభమయ్యాయి.అనంతరం ఆ ఆస్పత్రి పేరుని 1936 జూలై 2న స్టాన్లీగా మార్చారు.1938 లో 72 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు.1963 కి ఈ సంఖ్య 150 కి చేరింది. 2018లో 250 మంది చదువుకున్నారు.- యామిజాల జగదీశ్
July 28, 2020 • T. VEDANTA SURY • Memories