ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
వ్యక్తిత్వమంటే..----సుజాత.పి.వి.ఎల్.
September 4, 2020 • T. VEDANTA SURY • News

జన్మించిన ప్రతిజీవి ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి ఆత్మను మరచిపోతుంది. భ్రమ కారణంగా మానవుడు సంతోషకరమైన అనుభవాలు, ప్రాపంచికమైన బాహ్య వనరుల నుండి కలుగుతున్నాయని భావించుటయే ముప్పు. ఈ ముప్పునెరుగక రూప, రస,గంధ, స్పర్శ, రాగాలకు దాసుడు కావటం, పాప కృత్యములు చేయటం మామూలు అయిపోయింది. జీవుని యొక్క అనుభవాలు, చేసే పనులు, మాట్లాడే మాటలు, ఇతరుల పట్ల ప్రవర్తించే తీరు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వమవుతుంది.