ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శంకరశర్మ(బేతాళకథ) -- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు . చెన్నై -పట్టువదలని విక్రమార్కుడు మరలా చెట్టుఎక్కి శవాన్ని ఆవహించి ఉన్న బేతాళునిబంధించి భుజానవేసుకుని చెట్టుదిగి మౌనంగానడవసాగాడు.అప్పుడు బేతాళుడు 'విక్రమార్క మహరాజా నీవు సకల కళావల్లభుడవు,అయిన నీవు ఈలోకంలోఎంతో పేరు పొందావు.అమరులు,సిధ్ధులు,సాధ్యులు, గరుడలు,కిన్నెరులు,కింపురుషులు, గంధర్వులు,యక్షులు,విధ్యాధరులు,భూత,ప్రేత,పిశాచ గణములు,రుద్రులు,మునిగణాలు,ఉరుగులు,తుహిషితులు ,దైత్యులు,భాస్వరులు,గుహ్యకులు,ఈలోకంలోని నరులు నీగుణగణాలను ధైర్యసాహసాలు,దానగుణశీల తగురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.అంతటి ఘనుడవు అయిన నీకుమనం వెళ్లేదారిలో ప్రయాణ అలసట తెలియకుండా శంకరశర్మకథచెపుతానువిను.... కాశీ నగరంలోని శారద,శిరోమణి దంపతులకు చాలాకాలం సంతానం కలగలేదు. ఏన్నోదానధర్మాలు చెసి అనంతరం వారికి ఒక బాలుడు జన్మించాడు అతనికి 'శంకరశర్మ'అనేపేరు పెట్టి సకల విద్యలు నేర్చుకోవడానికి విష్ణుశర్మ అనే పండితుడు నిర్వహించే గురుకులంలో చేర్పించారు.అలా గురుకులంలో ఋగ్వేదము, యజుర్వేదము,సామ,అథర్వణవేదాలతోపాటు శిక్ష, వ్యాకరణము ,ఛందస్సు, నిరుక్తము,జోతిష్యము,కల్ప,మీమాంస,న్యాయము,పురాణము,ధర్మశాస్త్రం, ఆయుర్వేదము,ధనుర్వేదము,గాంభీర్యము,అర్ధశాస్త్రము,వంటి అష్టాదశవిద్యలు అభ్యసించి, తల్లితండ్రులతో కలసి కాశీరాజు గారి సభమందిరంలో ప్రవేసించి 'జయము జయము మహరాజుగారికి .మహరాజా నేను మన రాజ్య అగ్రహారం నివాసిని,సకల విద్యలు అభ్యసించాను.నావిద్యా సామర్ధ్యతను పరిక్షించి నాకు తమరి కొలువులో పండితుల సరసన చేరే అవకాశం కలిగించండి. అన్నాడు శంకరశర్మ.ఆసభలోని పండితులు రాజు గారి అనుమతితో 'చిరంజీవి నువ్వు మా సరసన రాజసభలో కూర్చోవడానికి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా' అన్నారు సభలోని పండితులు. 'ప్రభువుల ఆజ్ఞ సరస్వతి స్వరూపులైన మీవంటి పెద్దల ఆశీర్వాద బలంతో నెగ్గుకురాగలను,శారదామూర్తులు ప్రారంభించండి'అన్నాడు శంకరశర్మ.'నాయనా పెద్దలఎడ నీగౌరవం,వినయం మెచ్చదగినవే ,ఏది 'ఏకోనావిశంతి' అశ్వమేథ యాగకర్తలను తెలాయజేయి'అన్నారుపండితులు. 'దిలీపుడు,దశరధుడు,శ్రీరాముడు,దుష్యంతుని పుత్రుడు భరతుడు, ధర్మరాజు, జనమజేయుడు, శార్వాతుడు,శతానీకుడు,అంబష్ఠుడు,యుధాంశేష్ఠి,విశ్వకర్మ,సుధాంసుతుడు,మరుత్తుడు,అంగుడు,దుర్ముఖుడు,అరతి,పుష్యమిత్రుడు,చాణిక్యవంశీయుడు వాతాపి,ఎలకేసి వంటివారు'అన్నాడు శంకరశర్మ'భళా చిరంజీవి,చతుర్వింతశత స్త్రీ రాగాలు ఎన్నో వివరించు' అన్నారు పండితులు. 'దేవకృయ,మేఘరంజి,కురింజి,బిలహరి,మనళిహరి,భాండి,హితదో,భల్లాతి,నాహుళి, దేసి,ముఖారి,లలిత, రామకృయ,వరాళి,గౌళ,గండకృయ,ఘర్జర,బౌళి,కల్యాణి,ఆహిరి,సావేరి,ఘంటారావము,కాంభోజి,శంకరాభరణము'అన్నాడు శంకరశర్మ. పండిత, పామరుల కరతాళ ధ్వనులతో రాజ సభ మారుమోగింది.'భళా పండిత శంకరశర్మమీరు నేర్చిన విద్య అమోఘం రానున్న పౌర్ణమినాడు మీరు మా పండితుల సరసన కూర్చొని మన ప్రజలను మీ ప్రతిభా పాటవాలతో ఆనందపరచండి'అన్నాడు రాజుగారు. 'ధన్యుడను మహరాజా'అని సభకునమస్కరించిన శంకరశర్మ తల్లితండ్రులతో యింటికి వెళుతూఅగ్రహరం దారిలో పాముకాటుకు లోనై ప్రాణాలు వదిలాడు. బిడ్డ మరణాన్ని చూసిన శారదా,శిరోమణుల ఆక్రందన మిన్నంటింది. ఆదారిన వెళుతున్నయోగి అది చూసి తన వద్దనున్నసంజీవి మణితో శంకరశర్మను బ్రతికించి తనదారిన తాను వెళ్ళిపోయాడు.నిద్ర లేచిన వాడివలే లేచికూర్చున్న శంకరశర్మ,ఏడుస్తున్న తన తల్లితండ్రులు, బంధువులు,ప్రజా సమూహన్నిచూస్తూ తను పెద్దపెట్టున ఏడ్చి అనంతరం ఫక్కున నవ్వాడు.'విక్రమార్కమహరాజా శంకరశర్మ ఎందుకు ఏడ్చాడు,ఎందుకు నవ్వేడు ,తెలిసి చెప్పకపోయావో నీతలపగిలి మరణిస్తావు'అన్నాడు బేతాళుడు.'బేతాళ శంకరశర్మ జన్మించినది మొదలు ఎన్నోప్రయాసలకు సకలవిద్యలు అభ్యసించి,ఎంతటికష్టాని అయినా ఓర్చి,ప్రయోజకుడినై తల్లితండ్రులను సుఖపెడదాము అనుకున్నతనకు అకాల మృత్యువు కబళించినందుకు మొదట ఏడ్చినా,మళ్లి తను బ్రతికి నందుకు నవ్వుకున్నాడు శంకరశర్మ'అన్నాడు విక్రమార్కుడు.అలావిక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతోసహ బేతాళుడు అదృశ్యమైయ్యడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికొరకు వెను తిరిగాడు.
July 27, 2020 • T. VEDANTA SURY • Story