ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శబ్ద వాహిని ..--డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,--హన్మకొండ ,వరంగల్.-9866252002--8886991785.
October 12, 2020 • T. VEDANTA SURY • Poem

పెద్దవాళ్ళకి ,
గుర్తుండొచ్చు !

ఇప్పటిపిల్లలకు 
తెలియకపోవచ్చు ,!

సంతోషాన్నీ ...
విషాదాన్నీ ....
సమపాళ్లలో పంచి 
సమాచారం అందించే ,
అత్యవసర సాధనం ,!

చాలమంది గుండెల్లో 
గుబులురేపిన,

వార్తావాహిని ...
అదే ..అదే ..
టెలీగ్రామ్ ...!

మోర్స్ మహాశయుడు ,
కనిపెట్టిన సాధనం ,
మోర్స్ కోడ్ తో ,
పనిచేసిన 
ప్రజాసంబంధ --
పనిముట్టు .....!

అంగట్లో ...
ఆధునిక త ...
సౌఖర్యాలకు 
మార్గదర్శనం చేసిందీ ,!

ఖర్చులేకుండా 
క్షణాల్లో --
సమాచారం అందించే ,
సాధనలు -
అందుబాట్లోకి వచ్చాయి ,!

ప్రజలమస్తిష్కంలో 
అత్యవసర మాధ్యమంగా 
ఒకవెలుగు వెలిగిన -
టెలిగ్రామ్ ...
కాలగర్బంలో కలిసిపొయింది !
సమాచార చరిత్రలో ,
ఒక అంశంగా మిగిలిపొయింది !!