ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శీర్షిక. జరంత మట్టుండాలే!--పెనుగొండ sarasija, కరీంనగర్. ఇల్లన్నంక వాకిట్లనో, వరండాల్నో నాలుగు వాన చినుకులు పడితె మనసు వాకిలి తడిశి కమ్మగా కట్టేసే వాసన కోసం జరంత మట్టుండాలే ! .. పొద్దుగాల్నే నిన్ను జూసి నవ్వి నీకు ముచ్చట జెప్పెందుకన్నా జరంత మట్టి.. ఆ మట్టి ల ముచ్చటగ ఓ మొక్కుండాలే! .. ఎన్నడన్న గుండె చెరువైన్నాడు ఏ వరండాల్నన్న నిలబడితే , ఎర్రని (నీ)కన్నీళ్ళల్ల పచ్చపచ్చని యెలుగులు నింపేందుకు ఓ పిచ్చి మొక్కన్నుండాలే! .. ఏ పూటన్న నువ్వు రందిల బడితే నాలుగు సుక్కల నీళ్లకే నిలబడ్డ నన్ను సూడమని నీకు ఊతమిచ్చేటానికన్న ఉత్తిగనే ఓ విత్తు విత్తి సూడరాదూ?? .. ఎన్నడన్న మట్ట కాలితే మట్టి పూసుకోనుంటవు గద! ఈపాలి జరంత మట్టిని మనసుకు పూసుకో! ఎంత సల్లగుంటదో ఎరుకైతది! ..
June 30, 2020 • T. VEDANTA SURY • Poem