ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శీర్షిక:-నేర్చుకో కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా అద్దాన్ని చూసి నేర్చుకో, ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అని., వెలుగునీడల్ని చూసి నేర్చుకో, ఎప్పుడూ ఒకరికి ఒకరు తోడుండాలని. సూర్యుణ్ణి చూసి నేర్చుకో, బద్ధకం వీడాలని., పుస్తకాన్ని చూసి నేర్చుకో, ధర్మాన్ని నేర్పాలని., వాయువును చూసి నేర్చుకో, ధర్మాన్ని ప్రతిచోటా విస్తరింపాలని., చెట్టును చూసి నేర్చుకో, సహాయ గుణం వీడకూడదని., నీటిని చూసి నేర్చుకో, ఎదుటివారి దాహం తీర్చాలని., గొప్ప వీరుణ్ణి చూసి నేర్చుకో, ధైర్యాన్ని ఎదలో నిలిపి ముందుకు సాగాలని., నీ గమ్యాన్ని చేరుకో, జీవితంలో ఆనందంగా జీవించు!!
June 24, 2020 • T. VEDANTA SURY • Poem