ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శీర్షిక: సెంచరీ నాటౌట్ ఇంటికి తాళమేసి గొళ్ళేం పెట్టడం మరిచినట్లైంది లాక్ డౌన్ లాడ్ డౌన్ యాడ జూసిన గిదే ముచ్చట ఐనా కోకొల్లలుగా కరోనా విజృంభన లక్షల్లో చేరిక కంటికి కనిపించకుండా, మందు గోళి పుట్టకుండా మొదలైన ఆటలో భారతాన లాక్ డౌడ్ మొదలై వందరోజులైంది చైనా విసిరిన కరోనా బంతుల్ని మనవాళ్లు చక్కగానే ఆడుతున్నారు యార్కరైనా బౌన్సరైనా మన బ్యాట్స్ మెన్ లు గట్టిగానే దంచుతున్నారు సిక్సర్లు ఫోర్లతో సెంచరీలు కొట్టుతూ నాటౌట్ గా క్రీజులోనే నిల్చున్నారు చైనాకు క్రికెట్ లో అనుభవ లేమి కన్పించిన అనుకున్న లక్ష్యం వైపు సాగుతూనే వుంది చైనాకు సామదాన దండోపాయాలు చక్కగా తెలుసు ప్రపంచాన్ని వణికిస్తూ వారు నటిస్తున్నారు మనోళ్ళు సెంచరీలలో విజయీభవే కానీ ఇక్కడ జరుగుతుంది గ్రౌండ్లో క్రికెటర్లే కాదు దేశమంతా క్రీజులోనే వుంది అన్ని దిక్కులలో శతకాలు దాటి వరల్డ్ రికార్డ్ కు పరుగు పెడుతుంది చరిత్రలో భారతం ఎప్పుడు పరుగులు పెడుతూనేవుంది ఆపదలో వున్నా అపన్నహస్తం ఇచ్చే మంచితనం శత్రువునైనా ప్రేమించే గొప్పతనం మన మట్టిలో వుంది దేశం కోసం ముందు నిలిచిన ధైర్య శీలురు సాగగా క్రికెట్ ఐనా కరోనా ఐనా తలవంచాల్సిందే మీసాలకు సంపంగ నూనె పెట్టుకున్న చైనా తగినమూల్యం చెల్లించేలా మనమంతా ఐక్యంగా సాగుతూ భౌతిక దూరంతో కరోనాను స్టేడియం ఆవల దాటించి జగత్తుకే ఆదర్శంగా భారతావని అడుగులేయాలి ఉండ్రాళ్ళ రాజేశం
June 30, 2020 • T. VEDANTA SURY • Poem