ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శీర్షిక:- మనిషెంత మూర్ఖుడో..రచన:- లిఖిత్ కుమార్ గోదా మనిషెంత మూర్ఖుడో బాబాయ్, ప్రతి మనిషి మనీషిలాగా కాకపోయినా కనీసం మనిషిలాగైనా బ్రతుకుతున్నాడని భ్రమలో వున్నా, కానీ అదంతా అబధ్ధమే.. నేను చేసిన పొరపాటుకు పరిపాటిగా క్షమాపణ అడిగినా నిన్నలా నన్ను నేడు చూడబోడు ఆ చూపులో ఎంతో కుటిలత్వం దాగుంది మాటల్లో ఎంతో కపటత్వం దాక్కుంది మాటల్లోనే కాదు బాబాయ్, అతని మేనులోని ప్రతి అంగుళం కల్మషంతోనే నిండుకొని ఉంది కాలకూట విషంతో నింపుకుని ఉంది
June 30, 2020 • T. VEDANTA SURY • Poem