ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
శ్రేయోభిలాషి --------- జీవన పోరాటంలో..అలసట చెందినప్పుడు ఓదార్పు నివ్వడమే కాదు ; బాసటగా నిలబడినవాడు ! సమస్యలతో సతమతమవుతున్నప్పుడు చక్కని పరిష్కారాన్ని చూపించడమే కాదు; ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించినవాడు ! అవస్థల్లో ఉన్నప్పుడు అడగకుండానే అక్కరలు తీర్చడమే కాదు; అవసరమైన మనో నిబ్బరాన్ని అందించినవాడు! అపాయంలో ఉన్నప్పుడు ఉపాయాలు చెప్పడమే కాదు; తోడుండి గుండె ధైర్యాన్ని నింపినవాడు ! బాధల్లో ఉన్నప్పుడు కన్నీరు తుడువడమే కాదు; కర్తవ్యాన్ని బోధించినవాడు ! మంచిని పది మందిలో చెప్పడమే కాదు, చెడును చెవిలో చెప్పి తప్పులను సరిదిద్దినవాడు! లోకమంత ఏకమైనా .. నీకంటూ 'నేనున్నా'ననే ధైర్యం చెప్పడమే కాదు ; కొండంత అండగా నిలిచినవాడు! అనురాగంలో అన్ననే మించిన వాడు, ఆప్యాయతను మిన్నగా పంచినవాడు, సంతోషాన్ని పెంచినవాడు, సంతాపాన్ని తృంచినవాడు, సదా హితాన్నే వాంఛించినవాడు అతడే నిజమైన హితైషి! అతడే స్వఛ్చమైన శ్రేయోభిలాషి !! - బాలవర్ధిరాజు మల్లారం
July 30, 2020 • T. VEDANTA SURY • Poem