ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సంకేతం ...:----డా .కె .ఎల్ .వి.ప్రసాద్ ,హనంకొండ
November 18, 2020 • T. VEDANTA SURY • Poem

పళ్లొచ్చిన పాపాయి 
ముఖం ....
అందంగా ఉంటుంది !

నవ్వినపుడు 
పలువరస చూస్తుంటే 
పరమానంద మౌతుంది !

చిట్టి ..చిట్టి ...
తెల్లని పళ్లు ,
చిగుళ్లకు -
ముత్యాలు అమర్చినట్టు ,
నవ్వుకు -
నగిషీలు చెక్కుతాయి !

ఆరునెలల పాపాయి 
దౌడల్లో ...
పంటి మొలక చూసి 
అమ్మ పడే ఆనందం 
అంబరాన్ని చుమ్బిస్తుంది !

రెండుసంవత్సరాల 
వయసులో ..
ఇరవై పాలపళ్లు వచ్చి 
అందరికి ...
ఆనందం పంచుతాయ్ !

ఆరేళ్ళ వయసు 
వచ్చెవరకూ -
అవి ..అలానే 
కొనసాగుతాయ్ !

పాలు తాగుతూ అమ్మను ,
ఎత్తుకున్న నాన్న భుజాన్నీ ,
కసుక్కున కొరికేది -
అప్పుడే ......!

పాపకు పళ్లొచ్చిన--
సంకేతం కూడా అదే ...!!
-----------------------
ఫోటోలో....
బేబీ..ఆన్షి.నల్లి.