ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సత్కర్మలే ఉత్తమమైన మార్గాలు--సుజాత.పి.వి.ఎల్.---ఎవరు చేసిన కర్మని వారు అనుభవించక తప్పదు. పూర్వ జన్మలోనైనా, ప్రస్తుత జన్మలోనైనా చేసిన కర్మలనే మనం అనుభవిస్తూంటాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కర్మలు చేయాలి కానీ, ప్రతిఫలాన్ని ఆశించ కూడదు. నేను ఫలానా మంచి పని చేసాను అయినా నాకు మంచి ఫలితం, తగినంత గుర్తింపు రాలేదని విచారించినచో దాని ఫలితం ఉండదు. ఎందుకంటే, సత్ఫలములైనా, దుష్ఫలములైనా ఆరగిoచవలసిన భోక్తలం మనమే కనుక.! అయితే కర్మ ఫలానుభవం నుండి తప్పించుకోవాలంటే కర్మ కోసమే కర్మను.. అదీ మంచి పనులను మాత్రమే చేయడం వల్లే సాధ్యం. సత్కర్మలే ఉత్తమమైన మార్గాలు. ఫలాపేక్ష లేకుండా చేసే పుణ్య కార్యాలే సత్కర్మలు. లాభం కావాలని కోరితే నష్టాన్నికూడా స్వీకరించటానికి సిద్ధoగా ఉండాలి. ఉదాహరణకి ఎవరికైనా విసనకర్రతో మనం ప్రేమగా విసురుతున్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు విరమించుకునే అధికారం మనకుంటుంది, అదే పని ప్రతిఫలాన్ని ఆశించి చేయాల్సొచ్చినప్పుడు మనకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే! అంటే ప్రతిఫలాన్ని వదిలి నప్పుడే పూర్తి స్వేచ్ఛ కలుగుతుందని గ్రహించాలి. ప్రతిఫలాపేక్ష కర్మ అనే ఉచ్చులో బంధిస్తుంది. కర్మ త్యాగంలో దాగున్న అసలు రహస్యం అదే!
July 24, 2020 • T. VEDANTA SURY • Story