ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సత్యమేవజయతే--కె ఎస్ అనంతాచార్య-- చిన్నతనాన ఇంటి దూలం మీద నాన్న రాత మనసు ఇంటికి నిట్టాడై నిలిచింది! దేశం లో విస్తరించిన సత్యం చెట్టు కొమ్మలు పూచిన ఆచరణ పూవులు దుఃఖాల నీడ ల్లోంచి సుఖాల తోటలలో విహారానికి సాగిన బుద్ధాన్వేషణ చీకటిని తొలగించిన వెలుతురు మిధ్యను అధిగమించిన వాస్తవo వర్త మానం లో గాంధీమార్గం నిప్పును తొక్కిన నిజo అగ్నిపునీతయైన శీలం మోహపు బంధాలు తెంచుకొని స్వార్థం గీతలు చేరపేసుకొని సలిపే శోధన, ఒక సాధన మంచు మేఘాలు తొలిగితేనె సత్యసూర్యుడి దర్శనం సహజీవనం చేసినప్పుడే ఋషిత్వం పట్టాభిషేకం కోసమే కదా శ్రీకృష్ణ గీతామృతం సత్యానికి నిదర్శనమె కదా సాధించిన ఘన స్వాతంత్రం బతకడం మహాసత్యం కోసమైనప్పుడే జీవితం సార్థక్యం పొంది జయగంటలు మోగుతాయి మనిషికి మరణం ఉండచ్చేమో కానీ సత్యానికి మరణం లేదు శివమ్,సుందరంగా శాశ్వతమై నిలిచే శిలా శాసనం
August 13, 2020 • T. VEDANTA SURY • Poem