ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సద్దుల_బతుకమ్మ_సంబురాల_ముచ్చట-- సరోజ పోచమల్లు
September 29, 2020 • T. VEDANTA SURY • Memories

ఏడ నన్న గూడ పల్లె  అయిన పట్నం అయిన మన ఆడక్కలకు మత్తు ఓపిక తోని ఏ పని సేసిన తాతిపారంగనే సేత్తరు.
ఇగ మన పూసవేర్ల అక్క  గూడ సేతికి గాజులు ఎయ్యంగా మెత్తటి సెయ్యి ఉన్న అక్కకు అయితే గాజులు సీట్లి పోకుండా మంచిగ ఎక్కేది.ఇగ జెరంత దొడ్డు బొక్క సెయ్యి అక్కకు అయితే గాజులు సెయ్యికి ఎక్కుడు కట్టం అయ్యేది .గాజులు అన్ని సిట్టి పోయేది. గయ్యన్ని మట్టి గాజులాయే గందుకే సేతికి ఎక్కిచ్చేటప్పుడు  గిట్ల సీట్లి (పగిలి) పోయేది.ఊళ్లే తిరిగి అమ్ముకునే ఆ అక్కకు గండ్ల మిగిలేడిది ఎంత.అయిన గూడ సిట్టి పోయిన గాజుకు పైస తీసుకోపోయేది. గాజులు అన్ని పలిగినయ్ అని  అనక పోయేది.ఒక్క మాట సుత అనక.సేతికి తొడిగిన గాజుకే ఖరీదు కట్టేది.
ముత్తైధ గాజులు సేతి నిండారుగా ఏసుకొని బతుకమ్మ  ఆడే టప్పుడు సప్పట్లు కొడుతాంటే సేతికున్న గాజులు గా సప్పట్ల తోని ఎగుతాంటే..ఇగ ఇనాలే సెవ్వులకు ఎంత మంచిగుండేదో..
ఇగ మన అక్కలంతా ఓ.పక్క పండుగకు ముత్తాబు ( ముస్తాబు)అయ్యే సామాను కొనుకుంటనే .ఇగ ఇంట్ల మొగోళ్లను పువ్వు కోసం తెమ్మని గెదిమేది.పండుగ పూట ఎక్కడి పువ్వు సాలక పొయ్యేది. ఓగలి కంటే ఓగలు బతుకమ్మను పెద్దగా పేర్వాలని పువ్వంత  దూసుకచ్చేది.గందుకే  అక్కలంతా పువ్వు కోసం గెదిమేది.ఇగ గప్పుడు గిట్ల బండ్లు ఎడియ్ సైకిల్ మీద నన్న, లేకపోతే ఓ.కచ్చురం కట్టుక పోయి .సేండ్లల్ల, సెలుకలల్ల,గుట్టల పొంట తిరిగి  పువ్వంత కోసి కచ్చురం నిండా పువ్వు తెచ్చేది.ముందుగాల అయితే గనుక(గునుగు)పువ్వు తెచ్చేది.ఇది మంచిగ కట్టలు కట్టి తీరొక్క రంగులు అద్ది గంపల మంచిగ పేర్సి పెట్టేది.
ఇంట్ల పనంత తీరినంక అందరు గూడి ఓ.కాడ కూకొని  ఏతో,కుతో ముచ్చట జెప్పుకుంటా గి కట్టలు కట్టుకునేది.
ఇగ తంగేడు పువ్వు ముందుగాల తెత్తే పువ్వంత రాలి పోతదని ఓ.రోజు ముందుగాల తెచ్చుకునేది.ఆడివిల సెట్ల నిండారుగా పచ్చగా పూసిన పువ్వును సూత్తే రెండు కండ్లు ఏడ సాలుతయ్ ఇగ..గా పువ్వంత సంచులు నిండా దూసుకచ్చి పెట్టుకునేది.
తంగేడు పువ్వు దొరక కుంటే అడివి తంగేడు పువ్వు,రేల(ర్యాల,రాల) పువ్వులు కూడా తెచ్చుకునేది.గియ్యన్ని కూడా జెరంత తంగేడు పువ్వు లెక్కనే ఉంటయి సూసుటానికి.
ఇగ అడివి తంగేడు కొమ్మలు జెరంత పెడుసు గుంటయ్.బతుకమ్మ వేర్సే టప్పుడు బొత్తల (మధ్యల)ఓసుటానికి..తంగేడు ఆకు లెక్క ఉండక పోయేది.
ఇగ పట్టుకుచ్చు(సీతమ్మ జెడ)పువ్వులు .గి పువ్వుకు ఒక్కొకాడ ఒక్కో పేరు వెట్టిరి ఇగ.
మా అవ్వగారి ఊరి కాడ నైతే పట్టుకుచ్చు అంటారు,అత్తగారి ఊరి కాడ సీతమ్మ జెడ లు అంటరాయే.ఇగ గి పువ్వులు సేండ్ల ల్ల ఒడ్ల పొంట నన్న ఇంటికాడ పెరట్ల జాగ ఉన్న ఏడ జాగ ఉంటే గాడ ఇత్తులు అలికితే సాలు బతుకమ్మ పండుగ నాటికి ముద్దుగా ముద్దలు,ముద్దలుగా పూత్తయ్. ఎంత సక్కటి రంగు.ఇగ గి పువ్వు తోని పేరిత్తే బతుకమ్మ మత్తు ముద్దుగుంటది.
బతుకమ్మ అంటేనే తీరొక్క పువ్వులతోని పేరుత్తరాయే.
బంతి తోటలు,సామంతి, కట్ల పువ్వు ,ఎర్ర కట్ల పువ్వు,ఉద్రచ్చ (ఉద్రాక్ష,రుద్రాక్ష)పువ్వు గి ఉద్రచ్చ పువ్వులు తీరొక్క రంగు ఉండేది.మందారం పువ్వు సాస్తిక్ పువ్వులు,ముద్ద గోరంట, రిక్క గోరంట గియ్యి కూడా ఏరే ,ఏరే రంగులు ఉండేది బతుకమ్మ కోసమే ఈ సెట్లను వెట్టుకునేది..
గి గోరంట ఆకు దంచి పెట్టుకుంటే సేతులు ఎర్ర వడేది.
ఇగ గి పండుగ ముచ్చట్లు గిప్పుడే ఒడవయ్ గాని అంటెంక మల్ల సెప్త.
S.. N.