ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సపోటా పండు -2 - ఉపయోగాలు :- పి . కమలాకర్ రావు
September 6, 2020 • T. VEDANTA SURY • health tips

సపోటా పండులో నిద్రను త్వరగా తెప్పించే గుణం వుంది. బాగా పండిన సపోటా పండు పొట్టు గింజలు తీసి వేసి మెత్తగా చేసి బెల్లం పాలు కలిపి వేడి చేసి రాత్రి పడుకునెప్పుడు తాగితే వెంటనే నిద్ర వస్తుంది. సపోటా పండులో పెరుగు కలిపి తింటే మామూలు విరేచనాలు , రక్త విరేచనాలు కూడా తగ్గి పోతాయి . ఇది కడుపులో పుళ్ళు రాకుండా కాపాడుతుంది. తలలో చుండ్రు పోవాలంటే , సపోటా గింజలను నలగ్గొట్టి నువ్వుల నూనెలో కొద్దిగా వేడి చేసి తలకు పట్టించుకోవాలి. దీనితో పేలు కూడా రాలి పడిపోతాయి. సపోటా గింజలను నలగ్గొట్టకుండా నూనెలో వేస్తె పేలిపోతాయి. తప్పక మెత్తగా నలగ్గొట్టాలి