ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా భావించిన కొడవటిగంటి కుటుంబరావు గారి వర్ధంతి నేడు స్మరించుకుందాం--తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితల్లో ఒకరు కొడవటిగంటి కుటుంబరావు . రచయితగానే కాకుండా హేతువాదిగానూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన్ను ముద్దుగా కొకు అని పిలుస్తారు. "చదువు" నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. కొడవటిగంటి కుటుంబరావు 1909, అక్టోబర్ 28న గుంటూరు జిల్లాలో జన్మించారు. 1980, ఆగస్టు 17న తెనాలిలో మరణించారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు రచయిత,హేతువాది కూడా. కొకుగా సుపరిచుతుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో అనేక రచనలు చేశారు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా కుటుంబరావు భావించారు.కుటుంబరావుకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ ఉంది. పదమూడేళ్ళ లేతవయసులోనే ఆయన కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాశాడు. 1925లో ఉన్నత విద్య పూర్తికాక ముందే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన వివాహం జరిగింది. 1 925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. బియ్యే పూర్తయ్యే నాటికి ఆయన నాస్తికునిగా మారిపోయాడు.కొకు ప్రముఖ రచనలు..చదువు, వారసత్వం, ఐశ్వర్యం, ఎండమావులు, అరుణోదయం, జీవితం మొదలగు నవలలు.. పీడకథ, మహా ఇల్లాలు, దాలిగుంటలో కుక్కలు, శీలపరిశీలన, పరిశోధనాబుద్ధి, బాహుకుడు మొదలగు కథలు.. అనగా...అనగా, నడమంత్రపు సిరి, కర్మయోగులు మొదలగు నాటికలు రచించాడు. ఇంకా అనేక గల్పికలు, అనువాదాలను, హాస్య, వ్యంగ్య కథలను కూడా కుటుంబరావు రచించారు.ఆనాటి చరిత్రకు దర్పణం 'చదువు'.కుటుంబరావు రచించిన నవల్లో చదువు చాాలా ఫేమస్ నవల. ఈ నవలలో డిప్రెషన్ కు ముందు ఇరవై సంవత్సరాల సాంఘిక వాతావరణాన్ని చిత్రించడానికి ప్రయత్నించాడు. "అభ్యుదయ సాహిత్యానికి సహాయంగా చదువు రాశాడు. చదువు ఉద్యమ నవల కాదు." రెండు మహా ప్రపంచయుద్ధాల నడిమి కాలంలో మారుతున్న విలువలకి మారని మనుషులకు మధ్య ఏర్పడ్డ సంఘర్షణ. ఈ నవల తెలుగు కుటుంబాల సాంఘిక జీవితానికి, ఆనాటి చరిత్రకు అద్దం పడుతుంది.1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. 1952, జనవరి 1 నుండి చనిపోయే వరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి చేశాడు.ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు.. జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు.. జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు అన్నారు. నేటి తరానికి కూడా కుటుంబరావు రచనలు మార్గనిర్ధేశం చూపుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. (సేకరణ): - మాడిశెట్టి గోపాల్
August 17, 2020 • T. VEDANTA SURY • News