ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమరసతా"నానీలు"(2 వ భాగం)---సాకి, 9951172002
September 17, 2020 • T. VEDANTA SURY • Poem

చేతివేళ్ళు
సమానం లేకున్నా?
ఒక్కటయితేనే
పిడికిల్లో బలం!

సద్గుణాలు
చూడటం నేర్చుకుంటే!
సమత్వమే
కనపడుతుంది

బాహ్యాకృతిని
చూస్తే అంతా బేధమే!
హృదయాకృతిని
చూస్తే అంతా ఏకమే!

చదువులు
డాక్టరేట్ దాకా!?
సమత పంచటంలో
ఫెయిలే అందరు!

గాలికి
కులపిచ్చి లేదేమో!
అందరిని
సమానంగా చూస్తది.