ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమరసతా"నానీలు--సామల కిరణ్-9949394688
September 15, 2020 • T. VEDANTA SURY • Poem

నీవు నేను కలిసి
మనమయితే
'మనుగడ'కి
భయమెందుకు? 

చదువుల్లో 
సమత్వం చెప్పినా
సర్టిఫికెట్లలో
కులం రాసుడేంది? 

నిన్ను నన్ను 
ఒకేలా మోస్తున్న తల్లి
ఒక్కరే!
తన్నుకోవడమెందుకు? 

నీ రక్తం నా రక్తం
ఎరుపే అయినా
గొడవల్లో
'రక్తం' పారుతోంది. 

కుంపటి మండేది
చలికాలమే
కులకుంపట్లో
మూడుకాలాల మంట