ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమిష్టి బాధ్యత----సాగర్ రెడ్డి--చెన్నై
October 27, 2020 • T. VEDANTA SURY • Poem

వరదలపై 
గరంగరమా?
అకాల వర్షాలపై
అనవసరపు 
ప్రేలాపనలా?
ప్రకృతితో పరిహాసమా??

ముందుజాగ్రత్త మరచి
నిష్కిృయాపరత్వంతో
పాలకుల పసలేని పాలన-
గతపాలకులపై
నెపం మోపి, 
తప్పించుకునే
సమయమా ఇది??

పౌరసమాజం
నిర్లజ్జ బాద్యతారాహిత్యం-
వ్యర్ధాలను పట్టించుకోక,
నాలాలను
నాశనంచేసి,
నాకెందుకు
అన్న భాద్యతారాహిత్యమే
ఈ కల్లోలానికి
కారణం!!

 భ్రష్టుపట్టించి-
ఇన్నరకాల తప్పిదములు
మరచి,
నిందమాత్రం 
అకాలవర్షాలపై
మోపే అనవసర
అబాండాలే
సమస్యకు పరిష్కారమా?
రేపటి భవితకు
ముందుజాగ్రత్తా??

నిందారోపణలు
పరిష్కారాలు కాజాలవు,
దాటవేతతో తప్పులు
ఒప్పులుగా మారవు.
దాచినా దోషిత్వం
కనులముందు ప్రత్యక్షం.

బాధ్యతను సమానంగ
పంచుకుని ఇప్పటి
దెబ్బలు గుణపాఠాలుగ
నేర్చుకుని మసలితే-
అది ప్రజలకు-
పాలకులకు
సర్వదా శ్రేయస్కరం!!