ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమైక్యతా రాగం--వురిమళ్ల సునంద, ఖమ్మం
September 29, 2020 • T. VEDANTA SURY • Story

చిన్నారి స్నేహితకు పూవులంటే చాలా ఇష్టం. అమ్మా నాన్నలతో కలిసి ఇంటి గేటుకు ముందు ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలను పెంచసాగింది.  ఆరోజు ఆదివారం సెలవు.
ఇంటి ముందు పూలతోటలో అటూ ఇటూ తిరుగసాగింది. ఇంతలో..
"ఓయ్! చిన్నారీ! ఇటు చూడు నేనే గొప్ప కదూ'!
"ఓయ్! పాపాయీ! నేనే గొప్ప కదూ'
"ఓయ్ ! బుజ్జాయీ! నేనే గొప్ప కదూ'.ఇలా మల్లె , మందారం,గులాబీ, బంతి చేమంతి, లిల్లీ , నందివర్ధనం పువ్వులు వాదులాడుకుంటూ చిన్నారి స్నేహితను  పిలుస్తుంటే ఆశ్చర్యం వేసింది. "మాలో ఉన్నట్టే మీకు గొడవలు ఉన్నాయా.. 
మీరు ఇలా తోటలో చిరునవ్వుల మోములతో పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది.అలాంటిది మీరు ఇలా పోట్లాడు కోవడం బాగా లేదు. మంచి మనసుకు మల్లె, లేత గులాబీ పెదాలు. ముద్దబంతి పువ్వు లాంటి నవ్వులు.. ఇలా మీ అందరినీ మాకు పోల్చుకుని మురిసిపోతాం." అలాంటిది మీరు ఇలా చేస్తే ఎలా" అన్నింటికీ ఆనందం కలిగించే మంచి మాటలు చెప్పింది. ఇంకా వాటితో "చూడండి మిమ్మల్ని కలిపి
 అచ్చంగా మన దేశంలో అనేక మతాలు కులాలు కలిసిమెలిసి ఐకమత్యంగా ఎలా ఉండాలో చెబుతాను" అంటూ  కొన్ని పూలను కోసి మాలగా అల్లింది స్నేహిత. అపుడు దండగా ఒదిగిన పూలన్నీ ఆనందంగా "భలే !భలే స్నేహితా! చిన్నారీ ! అంటూ సంతోషంగా భరత మాత మెడలో హారంగా ఒదిగి సమైక్యతా రాగం ఆలపించాయి.