ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సమ సమాజానికి బాట-- కిరణ్ చిటికెన... సెల్.. 9490 84 1284.--ఐద్వా, సమన్విత వారి ఆధ్వర్యంలో కొవూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన “ అస్మిత “ కథల సమాహారానికి ముందుగా నా నమస్సులు. ... “ అస్మిత ” కథల సమాహారం ( పుస్తకం ) ప్రచురింపబడిన కథ సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిన కథ “ విజేత ” ఈ కథను కళ్లకు కట్టినట్టుగా ట్రాన్స్జెండర్స్ యొక్క జీవన కదంబం లో నుండి మనసు విప్పి మాట్లాడినట్లుగా అక్షర సత్యంగా రాసిన శ్రీమతి “ వంజారి రోహిణి ” ప్రముఖ రచయిత్రి గారికి నా అభినందనలు.... ఓ “ విజేత “ విజయ ప్రస్థానం..... కుల,, మత, వర్ణ, లింగ విచక్షణ లేకుండా మనిషి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని తెలియజేసిన కథ... విజేత. విజయానికి వైకల్యం అడ్డుకాదని ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళితే సాధించలేనిది ఏదీ ఉండదని తేల్చి చెప్పి ఈరోజు సమాజానికి యువతకి ఒక సూచికలా ఈ కథాంశం సాగింది. సాటి వ్యక్తి లో చూడాల్సింది వైకల్యం కాదని ఎదుటి వ్యక్తిలో చూడాల్సింది ప్రతిభ మాత్రమే అని తేల్చి చెప్పిన టువంటి తీరు చాలా బాగుంది. నేటి సమాజంలో ట్రాన్స్జెండర్స్ యొక్క జీవన విధానం వారు పడుతున్న టువంటి క్షోభ వారి మనసు లోగిలి తడితే బయటపడే హృదయవిదారకమైనటువంటి సంఘటనలు అంతా ఇంతా కాదు. కన్నీటి పర్వమవుతాయి. వారికి వైద్యరంగంలో ఉన్నటువంటి ఆధునిక సదుపాయాలను ఉపయోగించుకొని శస్త్ర చికిత్సలు చేయించుకునే కొందరికి స్తోమత ఉన్నప్పటికీ సంపూర్ణ ఫలితాలు ఆశించే విధంగా లేకపోవడం వలన సంపన్నులైన ట్రాన్స్జెండర్స్ కూడా ఆ జీవితం నుండి బయటపడే అవకాశాలు లేవు. సమాజంలో ఆడ, మగ అనే సంఘటితం ఉన్నప్పటికీ వీరు కూడా సమాజంలో అందరిలా సమాన హక్కులు కలిగి ఉన్నారని వీరికి మనసు మమత కోరికలు ఉంటాయని ఈ కథ పూర్వకంగా తెలియజేయడం అయినది.ఇకపోతే పేద తరగతి వర్గం లో ట్రాన్స్జెండర్స్ ఉన్నట్లయితే వాళ్లు సమాజంలో నెట్టుకు రావడం కోసం పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రత్యేకంగా చెప్పాలంటే సమాజంలో వారు ఎదుర్కొంటున్న టువంటి సామాజిక వైకల్యం తో సమాజం చూస్తున్న చూపు వారిపై ప్రభావం చాలా పడుతుంది. వారిలోనూ ఒక హృదయం ఉందని వారికి జీవించే హక్కు ఉందని సమాజం కూడా ఉన్నత హృదయంతో గుర్తించాలి... వారు కూడా మనోధైర్యంతో ముందుకు సాగుతూ తనలో ఉన్న శక్తిని బయటకు తీసి తన ప్రతిభతో ముందుకు సాగిపోవాలి. ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అయినా ఓటమి అయినా బానిస కాక తప్పదు అని నిరూపించాలి. ఒక వ్యక్తి పుట్టుకతోనే సర్వ తెలివితేటలు కట్టుకొని రాడు. సమాజంలో తాను నిర్మించుకున్న జీవన విధానం ద్వారానే ఒక వ్యక్తి గమనం ఉంటుందని గమనించాలి. సాధనతో కార్యదీక్షతో సాధించలేనిది ఏదీ ఉండదని, తన విజయం కోసం ఎవరో వచ్చి అండదండలు ఇవ్వరని ఎవరికి వారే తనలోని ప్రతిభను బయటకు తీసి ఈ ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది..కొందరు రైల్వే స్టేషన్లలో బిక్షాటన చేస్తూ... మరికొంతమంది పుణ్యక్షేత్రం ల వద్ద దేవుడి పేరుతో తిరుగుతూ ఉంటాడు.. ఇది సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం.. కానీ వారు ఆ స్థాయికి రావడానికి వైకల్యం అయినప్పటికీ “సామాజిక వైకల్యం “ వారి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ప్రతి మనిషి తన కడుపు నింపుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. అందులో భాగంగా వీరి యొక్క జీవన విధానంలో వారికి వారే ఏర్పర్చుకున్న ఒక కొత్త ధోరణి లో వీళ్లు బతుకుతున్నారు. వారికి వారే ఏర్పర్చుకున్న ఒక కొత్త ధోరణి లో వీళ్ళు బ్రతుకుతున్నారు వారి కుటుంబం నేపథ్యంలో కన్న వాళ్ళ తో సహా చూపించే అసమానతలు ఇంతా అంతా కాదు. వారికి ఒక హృదయం ఉంటుందని వారికి అందరిలాగానే మనస్సు కోరికలు ఉంటాయని ఊహించ కుండా వివక్ష చూపడం సర్వసాధారణమైపోయింది.. దీనికి కారణం...... “ సామాజిక వైకల్యం ” ఈ వైకల్యాన్ని వాళ్లు ఎదుర్కొంటూ జీవన విధానాన్ని ఏదో రకంగా ముందుకు సాగిస్తున్నారు.... ఇక వీరి విషయంలో వారు మనసు ఇంకా పరిణతి చెందాలి . దీనికి సమాజంలో సాటి వ్యక్తి గా అందరూ గుర్తించాలి. ఆ ట్రాన్స్జె జెండర్స్ లో ఎందరో మంది విద్యావేత్తలు ఉన్నారు, ఉన్నత అధికారులు కూడా ఉన్నారు....అన్ని రంగాల వారు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు... కానీ సమాజం దీన్ని గమనిస్తుంది ఈరోజు అనే విషయాన్ని పరిశీలిస్తే ఆ వివక్షతను రూపుమాపడం కోసం ఒక గొప్ప ప్రయత్నం.." ట్రాన్స్ జెండర్ " లు కూడా మనలాంటి మనుషులే. వారు కూడా సమాజంలో భాగమే. వారికీ అందరిలాగబ్రతకాలని కోరిక ఉంటుంది. వాళ్ళ ని చూసి అవహేళన చేయకుండా కాస్త చేయూతనిస్తే వారుకూడా సంతోషంగా బ్రతుకుతారు. ఆనందంగాజీవించటం ప్రతి ఒక్కరి హక్కు. దానికోసం మనందరం బాధ్యత తీసుకోవాలి అంటూ ముందుకువచ్చి సమాజాన్ని జాగృతం చేయటానికి నడుంకట్టిన "ఐద్వా, సమన్విత, కోపూరి ట్రస్ట్" ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ల సమస్యలు, పరిష్కారాలు ఇతివృత్తంగా తీసుకుని వ్రాసిన 19 కథల సమాహారం....” అస్మిత”.. పుస్తకావిష్కరణ ఇందులో 19 కథలను చేర్చారని రచయిత/రచయిత్రులు... తెలియజేశారు.. ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సమాజం కోసం, సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను ఎదుర్కునే బృహత్తర కార్యక్రమం చేపట్టిన” అస్మిత” పుస్తక రూపకర్తలకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.. ఇందులో ఒక ప్రత్యేకత గా కథ “ విజేత “ పేరుతో శ్రీమతి ” వంజారి రోహిణి “ ప్రముఖ రచయిత్రి గారు. ఒక మంచి కథ పేరును నిర్ణయించి నందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు....
August 7, 2020 • T. VEDANTA SURY • Book Review