ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సరదా సన్నివేశం-- కే సృజన్ సింధూర్
November 3, 2020 • T. VEDANTA SURY • News

నా పేరు కే సృజన్ నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను అవి నేను మూడో తరగతి చదివే రోజులు మా స్కూలు మా ఇంటికి ఎదురుగా నే ఉంటుంది రోడ్డు దాటితే చాలు స్కూల్ కి వెళ్ళవచ్చు ఒకరోజు మా స్కూల్ లోని ఒక అబ్బాయికి నాకు కూర్చునే స్థలం విషయంలో తగాదా వచ్చింది ఇద్దరం గట్టిగా పోట్లాడుకున్నాం ఇంతలో ఇంటి బెల్లు కొట్టారు అందరం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం ఆ అబ్బాయి ఇంటికి వెళుతూ నాతో ఇలా అన్నాడు మధ్యాహ్నం అన్నం తిని వచ్చేటప్పుడు నేను మా తాతయ్య ను తీసుకు వస్తాను నీ పేరు చెప్తాను అని ఆ మాట వినగానే నాకు కోపం పోయి భయం పట్టుకుంది ఆ అబ్బాయి నిజంగానే వాళ్ల తాతయ్య ను తీసుకు వస్తాడేమో ఇప్పుడు ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను అమ్మ అన్నం పెడుతుంది కానీ తినబుద్ధి కాలేదు ఆలోచించి ఆలోచించి భయమేసి ఏడుపు వచ్చింది ఓ మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నాను ఇంతలో అమ్మ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ స్వీటీ అని అడిగింది ఇంతకీ చెప్పనే లేదు కదూ నా ముద్దు పేరు స్వీటీ స్కూల్లో జరిగిందంతా అమ్మకు చెప్పేశాను అంతా విని అమ్మ నువ్వు ఇలా ఏడవకూడదు స్కూల్ అంటే అలాగే ఏడిపిస్తుంటారు వాళ్ళు ఎలా బెదిరిస్తే నువ్వు కూడా అలాగే బెదిరించాలి అన్నది అందుకే కదా అమ్మ నేను ఏడుస్తున్నది అన్నాను అమ్మకు ఏమీ అర్థం కాలేదు ఆ అబ్బాయి స్కూలుకు వాళ్ల తాతయ్య ను తీసుకువచ్చి ఇస్తానన్నాడు నేను కూడా తాతయ్యను తీసుకు పోదామంటే మన తాత ఏమో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఎలా ఎలా అందుకే నేను స్కూల్ కి వెళ్ళాను అన్న ను విషయం అంతా విని అమ్మ నవ్వుతూ తాతయ్య లేకపోతే నేమ్ నేనున్నాను నాన్న ఉన్నారు తమ్ముడు , పనివాళ్ళు  మన ఇంట్లో చాలా మంది ఉన్నారు మేమందరం నీకు తోడుగా వస్తాం నువ్వు భయపడకు అన్నది ఓహో అలాగా నా కోసం చాలామంది ఉన్నారు ఎవరినైనా నా తీసుకువెళ్ళవె ,