ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్జరీ తరువాత : ప్రమోద్ ఆవంచ
August 28, 2020 • T. VEDANTA SURY • Serial

సీఏబీజి సర్జరీ అయిన పేషెంట్లలో  85 శాతం మందికి హార్ట్ఎటాక్ లక్షణాలు వుండవు.సర్జరీ అయిన తరువాత పది సంవత్సరాల వరకు పేషెంట్ చనిపోయే అవకాశాలు తక్కువగా వుంటాయి.ఈ సర్జరీనీ కార్డయే థొరాసిక్ సర్జన్ చేస్తారు.ఆంజీయేప్లాస్టీని కార్డియాలజిస్ట్ చేస్తారు.
సీఏబీజీ సర్జరీ ఎలా చేస్తారు? అంటే ముందు గుండెకు దగ్గరగా వుండే ఛాతి బోన్ భాగాన్ని తెరిచి గుండె పని చేయకుండా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు.ఆ తరువాత గుండె, ఊపిరితిత్తుల బైపాస్ మిషిన్ ను అమర్చుతారు. ఆ మిషిన్ ద్వారా సర్జరీ అయిపోయేంత వరకు రక్తం, ఆక్సిజన్ ను మిగితా శరీర భాగాలకు సరఫరా అయ్యేలా చేస్తారు.అలా చేయడం వల్ల సర్జన్ ఆపరేషన్ చేయడానికి సులభంగా ఉంటుంది.సర్జరీ తరువాత గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరిస్తారు.మామూలుగా ఆపరేషన్ తర్వాత గుండె తనకు తానే స్వంతంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది.కొన్ని సందర్భాల్లో అలా జరగక పోతేచిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి గుండె స్పందనలను పునరుద్దరిస్తారు.మిగితాది రేపు......