ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్దార్ వల్లబాయ్ పటేల్ :- జగదీశ్ యామిజాల
October 31, 2020 • T. VEDANTA SURY • Poem
  • ఉక్కుమనిషి అనే మాటకు
    అన్ని విధాలా తగిన మహామనీషి
    వల్లబాయ్ పటేల్
  • ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో
    పుట్టిపెరిగిన పటేల్ 
    నీతినిజాయితీలకు పెట్టిందిపేరు
    మంచికోసం 
    ఎన్ని అవరోధాలొచ్చినా 
    అధిగమించి 
    జీవితాన్ని అంకితం చేసిన 
    అసలుసిసలు ఉక్కుమనిషి
    వల్లబాయ్ పటేల్
  • గుజరాత్ లో 
    తిరుగులేని న్యాయవాదిగా 
    వినుతికెక్కిన పటేల్
    నిజంకోసం పోరాడిన మనీషి
  • గాంధీ మార్గంలో 
    పలు పోరాటాలలో పాలుపంచుకుని
    తిరుగులేని విజయాలు సాధించి
    ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడు పటేల్
  • దేశభక్తుడు పటేల్
    ఒకరిని మరణదండన నుంచి
    తప్పించడానికి వాదిస్తున్న వేళ
    ఓ చీటీ అందుకున్నా
    ఏ మార్పూ లేకుండా
    వాదించి అతనిని కాపాడిన తర్వాత
    బయటికొస్తూ 
    తన భార్య మరణించిందంటూ
    ఇంటికి చేరిన ఉక్కుమనిషి 
    వల్లబాయ్ పటేల్
  • దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత
    స్వదేశ సంస్థానాలు ఎవరితోనైనా చేరవచ్చని తెల్లదొరలు ప్రకటించి
    పోయినప్పుడు
    తన నిర్ణయాలతో
    అందరినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చి
    మహనీయుడు పటేల్
  • భారత తొలి హోంమంత్రిగా 
    ఉన్న రోజుల్లో 
    దేశంలోని అనేక ప్రాంతాలు
    ఇప్పటి ఇండియాగా ఉండటానికి
    కారకుడు పటేల్ 
     
    దేశ ప్రప్రథమ ప్రధాని నెహ్రూతో 
    తన నిర్ణయాలను చెప్పడంలోనూ
    అమలు చేసి చూపడంలోనూ
    ఏమాత్రం వెనకడుగు వేయని ఉక్కుమనిషి పటేల్
  • గాంధీజీ మరణం తర్వాత 
    ఆర్ ఎస్ఎస్ ని నిషేధించాలని 
    నెహ్రూ నిర్ణయించుకున్నప్పుడు
    నిర్ద్వంద్వంగా తిరస్కరించిన 
    మనీషి పటేల్
  • మీరు ప్రధానిగా పదవీ బాధ్యతలు
    చేపడితే తామంతా మీ వెంటే ఉంటామని
    ఎక్కువమంది కాంగ్రెస్ ఎంపీలు
    ఒత్తిడి చేసినప్పుడు
    "మీరు నావైపుండొచ్చు
    కానీ 
    ప్రజలు నెహ్రూ వైపేగా ఉన్నారు" అంటూ
    గట్టిగా చెప్పిన గొప్ప నేత పటేల్
  • మన దేశానికి 
    చైనాయే శత్రువని
    చైనాను నమ్మవద్దని
    నెహ్రూని హెచ్చరించిన పటేల్
    స్వాతంత్ర్యానంతరం
    రెండేళ్ళే బతికిన ఈ ప్రజానేత లోటుని
    నేటికీ పూడ్చినవారు లేరు
  • నిరాడంబరతకూ
    ముక్కుసూటిమనిషిగా
    వినుతికెక్కిన 
    ఉక్కుమనిషి పటేల్ 
    త్యాగనిరతికి జోహార్లు