ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్వేజనాః సుఖినోభవంతు--కె ఎస్ అనంతాచార్య
September 10, 2020 • T. VEDANTA SURY • Poem

కల్పనలు,అనుమనా
ల్లోంచి బయటపడితే
 బహిరంగ సత్యం బయట పడుతుoది

ఉన్నతుడిగా భావించే
మనిషి ఉత్తమ లక్షణాలుంటే 
పది మంది తో మమేకమవుతాడు

నీ ఇల్లు బాగుంటే కాదు అందరు ఇండ్ల మీద ప్రేమ పతాకం ఎగురాలి

దేహం మోహమే కావచ్చు
వాంఛలు తీర్చే ఉపకరణo కాదు
అది
సర్వప్రాణి సంక్షేమానికి
నిలబడే పచ్చని మాను కావాలి

ఒకరి ఎదుగుదల
మరొకరికోసం ప్రగతి
నిచ్చేనై మెట్లెక్కించాలి
పదిమంది నుదిటి మీద  
చంద్రుడై వెలగాలి

మనం ముక్కు మూసుకుంటే
సమస్యలు సరికావు 
చుట్టూ వున్న వారిని
తపస్సుకు ఉద్యుక్త పరచాలి

చీకటిని తిట్టకు
తలుపులు బిగించుకొని వెలుతురు లేమి ఎదుటి వాడి కుట్రలా
భావించకు

గుర్విందగింజయయి
గుండం గీసుకోవద్దు
మనసు విశాలం చేసుకొని వసుధైక కుటుంబం లో వాణీ లా అందరి నోళ్ళలో
మృదు మధుర పలుకులు పలికించాలి

అందరూ బాగుండాలి
అందులో నేనుండాలి
అంటూ ఆర్ష వాక్యం
వల్లెవేస్తే అన్ని 
 గేహాల్లో ఆనందం తాండవమాడుతుంది