ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి -రా మాయణం,భారతం,భాగవతం వ్యాసవాల్మీకులెలా రాశారో గాని జరిగిన సంగతులు గుదిగుచ్చి చెప్పడం ఎంత కష్టమో అర్థమవుతుంది.ఒక ప్రస్తావన వస్తే అందులో అనేక మంది ఉంటారు. వారిలో ఒకరి గురించి చెప్పినపుడు మిగతా వారిని గురించి చెప్పడానికి వీలుకాదు.ఒకేసారి అనేకమందిని గురించి తెలియజెయ్యాలంటే ఆ పాత్రలన్నిటినీ తెచ్చి వాటి ద్వారానే కథ నడిపించాలి.జరిగిన సంఘటనను జరిగిన కాలంలో అన్ని పాత్రలతో చెప్పా లంటే తప్పక నాటకం రాయాల్సిందే.అందుకే‘కావ్యేషు నాటకం రమ్యం ‘ అన్నారు.నిన్న ‘క్విట్ ఇండియా’ వీథి నాటిక గురించి చెప్పాలనుకున్నాను. దాని గురించి చెప్పాలంటే పూర్వా పరాలన్నీ చెప్పాలి.దానికి కారణ భూతుడైన వ్యక్తి గురించి పరిస్థితుల గురించి చెప్పాలి.కనుక మిత్రుడు సురేశ్కుమార్ ప్రస్థానం చెప్పటం జరిగింది. ఆయన గురించి కూడా చాలా కప్పదాట్లు వేయాల్సి వచ్చింది.మళ్లీ వీలు చూసుకు ని ఆ వివరాలు చెబుతాను.ఇప్పుడు మళ్లీ ‘క్విట్ ఇండియా ‘దగ్గరకే మళ్లీ రావ డానికి ఇంత ఉపోద్ఘాతమన్న మాట.‘క్విట్ ఇండియా’ అంటే అదేదో ఆంగ్లేయులకు కాలానికి చెందిన స్వాతం త్ర్య పోరాటపు ఇతివృత్తమనుకుంటు న్నారేమో.కాదు అది సురేశ్ గారి బుర్రలో తట్టిన ఆధునిక జన జాగృత నవేతి హాసం.సమాజంలో కనులముందు జరుగుతున్న దోపిడీల వ్యవహారం. సామాన్య మానవుని పై స్వార్థపర శక్తులుఎలా తమ పన్నాగాల పంజాలను విసురుతున్నారో ప్రజానీకానికి తెలియ జెప్పి కనువిప్పు కలిగించాలనే ప్రయత్నం. ఆఫీసుల్లో,ఆసుపత్రుల్లో,రాజకీయాల్లో ఎలా దేశద్రోహులు ప్రబలి పోతున్నారో వారిని ఉద్దేశించి అలాంటి దేశద్రోహుల్ని క్విట్ ఇండియా అని చెప్పే నాటిక అది.ఆ వీథి నాటికలో నటించే పాత్రలకు మేకప్ ఉండదు.అందరిదీ ఒకే ఆహార్యం.ప్యాంటు లాల్చీ నడుముకు కటిటుకోడానికో గుడ్డ.అంతే .అందరం ఓ నాలుగు రోడ్ల కూడలికి వెళ్లి చాక్ పీసుతో ఓ పెద్ద వలయాన్ని గీసి డప్పులతో ముందు చుట్టుపట్ల ఉన్న జనాలందరూఆ వలయం చుట్టూ చేరే లాగా మ్యూజిక్దాని కనుగుణంగా డప్పుల శబ్దం. వలయంలో ఒకే రకం దుస్తుల్లో ఉన్న పాత్రధారులంతా వలయాకారంలో తిరుగుతూ ఉండగా నాటిక మొదల వుతుంది.మ్యూజిక్ విషయ మంతా రంగనాథ్ గారు చూసుకున్నారు.వారికితోడు మరికొందరు మిత్రులు.ఎరీనాలోప్రయోక్తగా సురేశ్ కుమార్ పాత్రధారులు గా ఏడు మందిమి ఉన్నట్టు గుర్తు. ఎప్పటి ముచ్చట ఇది 1986 లో మొదలు పెట్టాము.కాగజ్ నగర్ లోనే దాదాపు పది చోట్ల ప్రదర్శించాము.దర్శకత్వం పాంచ జన్యం గారు. సన్నివేశ రూపకల్పన పాత్రల నటనతోనే మనకు తెలిసి పోతుంది,అందులో ఒకడు డాక్టరని ఒకడు కాంపౌండరని,ఒకడు పేషంటని. ఏ వస్తువు లేకుండా అంటే డాక్టరుకు తెల్ల కోటు ఉండదు స్టెతస్కోపు ఉండదు.అంతా మైమ్ చేయడమే.కాని ఏం చేస్తున్నారో ప్రేక్షకులకు తెలియాలి.ఒక రకంగా ఇప్పుడు టివిలో వస్తున్న జబరదస్త్ లాంటి ప్రయోగం 35 ఏండ్ల క్రింద నడివీథిలో ప్రదర్శించి రక్తికట్టించ డం మాటలు కాదు.ఆ క్రెడిటంతా దర్శకుడు పల్నాటి పాంచజన్యం గారిది.ఆ తరువాత అందులో నటించిననటులది.ఇప్పుడు ఆ పేర్లు నాకు గుర్తున్నాయో లేదో నన్ను నేను పరీక్షించుకోవాలి.ఇది లలితకళా సమాఖ్య ప్రదర్శన గనుక ధాదాపు అన్ని సమాజాలనుండి ఒకరినో ఇద్దరినో తీసుకున్నట్లు గుర్తు.సరే నటుల పేర్లు నాకు గుర్తున్నంతవరకు 1.సిద్ధిరాములు.2రాజమోహన్ 3.డి.సత్యనారాయణ 4..దాసరి రామకృష్ణా రావు. 5.జి.యాదగిరి. 6.జ్ఞానేశ్వర్.7.నేను.రంగనాథ్ సారు క్యాషియో వాయిస్తే ఆయనకు తోడుగా శిశుమందిర్ సత్యనారాయణ సారు కంజర వాయించారు కొన్ని స్థానిక ప్రదర్శనల్లో.మొత్తానికి అదో గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రాం.దీని తరువాత దాదాపు అన్ని సమాజాల నటులు కలిసి వేసిన నాటకం వీర బొబ్బిలి.ఇది శారదానాట్య కళామండలి వారి ఆధ్వర్యంలో పాంచజన్యంగారి దర్శకత్వంలో వేశాము. దాని గురించి తరువాతి భాగంలో.
August 14, 2020 • T. VEDANTA SURY • Memories