ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -ముప్పైకి పైగా మా ల్యాబ్ స్టాఫ్ మెంబర్లని చెప్పాను కదా! అందులోశ్రీధరన్ ఇంఛార్జ్, గోపాలక్రిష్ణన్ అసిస్టెంట్ ఇంఛార్జ్, ఆశీర్వాదం, కే.డి.ఫ్రాన్సిస్,(నాతో పాటే అప్పాయింట్ ఐన కెమిస్టు) శంకరన్ అనే స్టోర్ కీపర్ మలయా ళీలు. అయ్యంగార్(రికార్డ్ అసిస్టెంటు) కన్నడిగుడు, రాంమూర్తి సీనియర్ కెమిస్టు తమిళియన్, పన్వల్కర్ మహారాష్ట్రీయుడు, గుణానంద్, ప్రభునారాయన్ సింగ్ ఔత్తరా హికులు.ఇక మిగిలిన వాళ్లు తెలుగు వాళ్లు. వారిలో టి.ఆర్.రావు,బి.వి.రత్నం (నాయుడు కాపు), తులసీ దాసు, రాధాకృష్ణ,యస్వీ రామారావు, ఎన్.రామా రావు,రామారావు(జూ)(కమ్మ), వెంకటేశ్వర్లు, నాథయ్య (వైశ్య), స్వామి (క్రిస్టియన్) ఆదినారాయణ,మల్లయ్య (పద్మశాలి), వి.రాజేశ్వర రావు, యం.లక్ష్మణరావు,వాసుదేవరావు,డి.రాంమోహన్ రావు, యం. యల్. యన్. రావు,వెంకటనారాయణ,నేను (బ్రాహ్మణ), వరదాచార్యులు(శ్రీ వైష్ణవ) అటెండర్లు ఉస్మాన్,రంజాన్,జహీరుద్దీన్(ముస్లిం)ఇలా మా ల్యాబొరేటరీనే ఒక మినీ ఇండియా లా ఉందంటే ఇక కాగజ్ నగర్ పరిస్థితి వేరే చెప్పనక్కర లేదు.[ఇది కేవలం అనేక ప్రాంతాల వాళ్లం అనేక మతాలు,కులాలకు చెందిన వాళ్లం కలిసి మెలిసి పని చేసామని తప్పడానిక మాత్రమే నని గ్రహించ ప్రార్థన.]ఇలా కలిసి పని చేయడం లో భిన్న సంస్కృతుల అవగాహన ఏర్పడిందని చెప్పవచ్చు.భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో నేను స్వానుభవ పూర్వకంగా తెలుసుకున్నాను.సౌభ్రాతృత్వం అంటే కూడా చవి చూశానని చెప్ప వచ్చు.అసలు మా డిపార్టుమెంటు అని కాదు మొత్తం సర్సిల్క్ ఎంప్లాయీస్ అందరూ దాదాపు ప్రాంతాలకు,కుల మతాలకు అతీతంగా ఉన్నారని చెప్పగలను.కాగజ్నగర్ లో ఉన్న రెండు మిల్లులకు రెండు కాలనీలు విడి విడిగా ఉండేవి. రెండు మిల్లులకు కూడా రెండు క్లబ్బులుండేవి. కంపెనీ (మిల్లు) తరువాత ప్రధానమైన ప్రదేశం అంటే క్లబ్ నే చెప్పుకోవాలి.రెండు మిల్లుల క్లబ్బులు కూడా విశాలమైన ప్రాంగణంలో ఆబాలగోపాలానికి అన్నిరకాల వినోదాలు అందు బాటులో ఉండే విధంగా రూపొందించబడినవి.సాయంత్రం అయ్యిందంటే పిల్లలను ఆటలాడించడానికి ఆడవాళ్లు క్లబ్బులోని పార్క్ కు వచ్చేవారు.దాదాపు అన్ని భాషల పత్రికలు,పుస్తకాలతో పెద్ద గ్రంథాలయముండేది.పుస్తక ప్రియులకు లైబ్రరీ ఒక అపురూపమైన చోటు.షటిల్ కోర్టు,బిలియర్డ్స్ రూం,క్యారమ్స్ క్రీడాకారుల ప్రియుల కోసం,ఇది కాక నిరంతరం సాగే చతర్ముఖ పారాయణం,సాంస్కృతిక కార్య క్రమాలకు,వారం వారం వేసే సినిమాలకోసంపెద్ద ఆడిటోరియం దీనికి తోడు క్యాంటీన్కూడా ఉండటంతో సాయం సమయాల్లో క్లబ్ వాతావరణమంతా కళకళలాడుతుండేది.కంపెనీలో పెద్దపెద్ద ఉద్యోగులు కూడా సాయంత్రం చతుర్ముఖ పారాయణాల్లో మామూలు ఉద్యోగులతో సరదాగా ఉండటంఒక కొత్త లోకంలో ఉన్నామనిపించేది.(సశేషం)లేబొరేటరీ పరివారం
August 1, 2020 • T. VEDANTA SURY • Memories