ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు-రామ్మోహన్ రావు తుమ్మూరి
August 23, 2020 • T. VEDANTA SURY • Memories

37 సంవత్సరాలకిందటి ఫోటో.ముందు కూచున్న వారిలో మధ్యలో అటూ ఇటూ మిత్రుల భుజాలమీద చేయి వేసి మోకాళ్ల కూచున్న బక్కపలుచని వ్యక్తి  ఎవరో గుర్తు పట్టారా?ఆ ప్రశ్న వేయగానే డిసైడై పోయుంటారుకదా నేనేననీ.అవును నేనే అక్షరాలా.ఇంతకీ ఈ వలస కూలీల బృంద ఛాయాచిత్రం ఏమిటనే ప్రశ్న మొదలై ఉంటుంది.కూలీలు అని అనుకోవడంల మీ తప్పు లేదుగాక లేదు.అక్కడికి వెళ్లింది సామాజిక వనం ఏర్పాటుకు వెళ్లిన విద్యార్థి కూలీలం.ఇంతకీ  ఏం విద్యార్థులు అని అడగరేం? బి.ఎడ్ కాలేజీ విద్యార్థులం.వారం రోజులపాటు ఆ గుట్టల ప్రక్క ఉన్న మైదానంలో మకాంవేసి కొన్ని వేల మొక్క లు నాటిన హరితవనంగ నిర్మాతలం.ఆ ప్రదేశమెక్కడో తెలుసా?
హనుమ కొండ హంటర్ కోడ్లో ఇప్పుడు జంతు ప్రదర్శన శాల ఉన్న 
చోటు.
      సరే ఇక అసలు కథలోకి వస్తాను.ఒకరకంగా ఇది నా వ్యక్తిగతమైన విషయం.కాని దీన్ని చదివిన తరువాత కాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఒక సారి చూడండి.మీ అందరికీ తెలిసిన విషయమే నేను సర్సిల్తులో పనిచేసేవాడినని.
కొన్ని కారణాలవల్ల 1984లో మిల్లు మూతబడింది.కార్మిక సంఘానికి మిల్లు యాజమాన్యానికీ సరిపడక లాకౌటు చేశారు.
ఇదిగో ఇప్పుడు కరోనా లాక్డౌన్ లాగానే కొన్ని సంవత్సరాలు 
మిల్లు ఉద్యోగులు మిల్లు మళ్లీ తెరుస్తారని ఎదురు చూస్తూ ఓ పూట తిని ఓ పూట తినక ఇళ్లల్లోన ఉండి బతుకులు వెళ్లదీసారు.రెండుమూడేండ్లు గడిచే సరికి చాలా మంది ప్రత్యామ్నాయ ఉపాధులు వెతుక్కుని వెళ్లి పోయారు.నేను ఇంటి ప్రక్కనే ఉన్న ట్యుటోరియల్ లో వారిచ్చే వందరూపాయలతో ,మా ఆవిడ జీతంతో కాలం నెట్టుకు వచ్చాను.మిల్లు తెరుచుకోదనే విషయం తెలిసే సరికే రెండు మూడేళ్లు నిరుద్యోగంతో సతమతమయ్యాను.అప్పుడు బి.ఎడ్ ప్రవేశపరీక్షకు కూచుంటే
మొత్తానికి వరంగల్ బి.ఎడ్ కాలేజీలో సీటు వచ్చింది.ఇక్కడో చిన్న
అంతర్నాటకం ఉంది.ఉష (నా శ్రీమతి)ఎయిడెడ్ స్కూల్లో పని చేరిందని చెప్పానుగదా.తను చేరేప్పుడు బి.ఎస్సి.టి.టి.సి.తో చేరింది.లాకౌట్ పీరియడ్ లో తనకు నెరేషన్ కోర్స్ బి.ఎడ్ . హైదరాబాదు ఏ.ఎం.ఎస్.లో చేసే అవకాశం దొరికింది. రెండు ఎండాకాలం సెలవుల్లో కోరకంప్లీటయింది. అయితే ఆమె ఎసైన్ మెంట్స్ తయారుచేయటంలో నాకు సగం బిఎడ్ అంటే ఏమిటో అర్థమయింది.దానికి తోడు సాయంత్రం సమయాల్లో ట్యుటోరియల్ క్లాసుల్లో దప్పిక లేని గుర్రాలకు నీళ్లు తాగించినట్టు 
ఇంగ్లీషు పాఠాలు చెప్పడం ఇది నా భవిష్యత్తుకు ముందు పడ్డ బాటలన్న మాట.అలా వరంగల్ బి.ఎడ్ కాలేజీలో చేరి బి.ఎడ్ తగులుతున్న రోజుల్లో సోషల్ సర్వీస్ లో భాగంగా సోషల్ ఫారమస్టు ఏర్పాటు బాపతు ఫోటో ఇదన్న మాట.ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్లంతా ఎక్కడో ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు.ఎందుకంటే అప్పటికి నా వయసు ముప్పై ఐదు మిగతా వారి వయసు 22 లేదా 23 అంతే.సరే అలా 35 ఏళ్ల వయసులో బిఎడ్ చేసిన నాకు అదృష్టం కొద్దీ అది బార్ కావ్యానికి మూడు నెలల ముందు గవర్నమెంటు టీచరు ఉద్యోగం వచ్చింది..
మా బాపు చేయమంటే ఇరవై ఏళ్ల వయసులోనే వచ్చిన ఠటీచరు ఉద్యోగం వదులుకొన కంపెనీలో పనిచేసినందుకు కాలం నా మెడలు వంచి టీచరుద్యోగంలో చేర్చింది.అందుకే అంటారు సహసా విదధీతనక్రియాం.