ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి -పాత విషయాలు తలచుకుంటే భలే గమ్మత్తుగా ఉంటాయి.రామస్వామి గారి సూచనల మేరకు టు ద మెసర్స్ సర్సిల్క్ లిమిటెడ్ అని మొదలు పెట్టి మిత్రుడు ARK Sastry సహకారంతో ఇంగ్లీషులో అప్లికేషన్ రాసి పంపిన కొద్ది రోజులకు ఇంటర్వ్యూకు రమ్మని పిలుపు వచ్చింది.అప్పటికి ఇప్పటి లాగా ఫోన్ సౌకర్యం లేదు.ఏదైనా ఉత్తరాల ద్వారానే.అంత వరకు ఎప్పుడూ ఒక్కడిని దూర ప్రదేశాలకు వెళ్ల లేదు.రైలు ప్రయాణం అసలే తెలియదు.మొదటి సారి పెద్దపల్లి లో జనతా ఎక్స్ ప్రెస్ ఎక్కి కంపార్ట్మెంటులో కూర్చొన్నా.చేతిలో సంచీ మోకాళ్ల మీద పెట్టుకొని భయం భయం గా ఉండటం నా ఎదురుగా కూర్చున్నా యన గమనించాడు.మెల్లెగా నన్ను మాటల్లోకి దింపి వివరాలడిగాడు. మంచి మాటకారి.నేను కాగజ్ నగర్ అని చెప్పగానే తనూ కాగజ్ నగరే సర్ సిల్క్ కాలనీ కే వెళుతున్నానని కాస్తా ధైర్యం కలిగించాడు.ఆయన పేరు గోవిందరావు ఖాండేకర్.మహారాష్ట్రియన్. సర్సిల్క్ ఎకౌంట్స్ లో పనిచేసేవారు.నాకు మొదటి సారి పరిచయమైన కాగజ్ నగర్ వ్యక్తి ఆయనే.ఆయన ధైర్య వచనాలు నా కిప్పటికీ గుర్తే.అలా ఎందరి సహకారం పొందుతామో జీవితంలో మనం ఎక్కువగా పట్టించుకోమేమో కానీ అలాంటి వారందరికీ కృతజ్ఞులమై ఉండాలి.సరే.చక్కగా రామస్వామిగారింటికి వెళ్లి అక్కడే ఉండి తెల్లవారి కంపెనీకి వెళ్లటం,రాతపరీక్షకు జనరల్ లేబొరేటరీకి వెళ్లటం,ఇంటర్వ్యూ తతంగం అన్నీ అయి మళ్లీ కరీంనగర్ వచ్చాను. ఇంట ర్వ్యూ ఏప్రిల్ లో ఐతే జూలై లో అప్పాయిం ట్ మెంట్ వచ్చింది.వెళ్లి నాలుగైదు రోజులు రామస్వామిగారింట్లోనే ఉండి,పర్సనల్ డిపార్టుమెంటు మెంటి వారి ఆదేశాలందుకొని సర్ సిల్క్ బ్యాచిలర్ హాస్టల్ లో చేరాను.ఇందాకటి గోవిందరావుగారి లాగా ఈ అలాంటి మెంట్ అంతా చేసే ఆయన పర్సనల్ డిపాజిట్ మెంట్ క్లర్క్ జోషి గారు నాకుఒక సింగిల్ రూం అలాంటి చేశారు.నేను స్వంతంగా వండుకుంటానని తెలిసి. మిగతా హాస్ట్లర్స్ అందరూ మెస్ లో తినే వారు.నేను కిరోసిన్ స్టవ్ గిన్నెలు వగైరా తీసుకు వెళ్లాను నాతో పాటు.హాస్టల్ ప్రక్కనే సర్ సిల్క్ క్లబ్.ఎదురుగా శిశుమందిర్ హైస్కూల్.ఎక్కడైతే నాకు రాత పరీక్ష జరిగిందో ఆ జనరల్ లేబొరేటరీలోనే నా ఉద్యోగం ల్యాబ్ కెమిస్టుగా.అందులోనే పని చేసే ఆదినారాయణ గారికి పరిచయం చేశారు నన్ను రామస్వామి గారు.ఆయనది సుల్తానాబాద్ దగ్గరి ఎలిగేడు.ఆయన నాకు అక్కడి విషయాలన్న వివరించి అందరితో పరిచయం చేసి మెల్లిగ పని నేర్పించటం మొదలు పెట్టారు.మూడు నెలలు ట్రెయినింగ్ పీరియడు లో నెలకు రూ.150/- ఆరునెలలు ప్రొబేషను టైం లో నెలకు రూ.175/-ఆ తరువాత కన్ఫర్మేషన్ కాగానే రూ.225/- మొదలయ్యే ఫోర్త్ గ్రేడు స్కేలు.అన్నీ సజావుగా సాగి పోయాయి.జాబ్ కన్ఫర్మ్ అయిన తరువాత ఇండిపెండెంట్ షిఫ్ట్ డ్యూటీ ఇచ్చారు.మా ల్యాబ్ దాదాపు సినిమా హాలంత ఉండే పెద్ద షెడ్.అందులో పది వర్కింగ్ బెంచ్ లుండేవి.ప్రతీ బెంచి కి ఒక పేరు.సొల్యూషన్ బెంచ్,సిపీ (కాటన్ ప్యూరిఫికేషన్) బెంచ్,వాటర్ అనాలిసిస్ బెంచ్,సిఎ (సెల్యులోజ్ ఎసిటేట్) బెంచ్,యం అండ్ యఫ్ ( మిక్సింగ్ అండ్ ఫిల్ట్రేషన్ ) బెంచ్, గ్యాస్ ఎనాలిసిస్ బెంచ్ ఇంకా కొన్ని సీనియ ర్లకు వివిధ రకాల అనాలిసిస్ లు చేయ డానికి బెంచి లు ఉండేవి. అందు లోనే ల్యాబ్ ఇంఛార్జ్ శ్రీధరన్ (మలయాళీ) గారిరూం ఉండేది.ఒక ప్రక్క స్టోర్ రూం,లైబ్రరీసొల్యూషన్ రూం ఇలా చాలా విశాలమైన ఎయిర్ కండిషన్డ్ ల్యాబ్ లో దాదాపు షిఫ్టు వాళ్లు నలుగురు,జనరల్ షిఫ్ట్ వాళ్లు ఏడెనిమిది మందితో కళకళలాడేది.తెలుగు వారితో పాటు తమిళ,మళయాళ,మహారాష్ట్ర ,ఔత్తరాహికులుండటంతో సంభాషణ ఎక్కువగా ఇంగ్లీషులో జరిగేది.అది నాకు కొత్త అనుభవం .చాలా రోజులు బట్లరింగ్లీషుతో కుస్తీ పట్టాను.ప్రొబేషనయ్సే లోగా ఓ మోస్తరుగ అలవాటయ్యింది.మొత్తం ముప్పైర్ పైగా డిపార్టుమెంటు స్టాఫుండేది.నా అదృష్టం ఏమిటంటే నన్నందరూ ఎంతో ప్రేమగా చూసుకునే వారు.అందరి దగ్గరా నేను పనులు నేర్చుకునే వాణ్ని.నాకు అంత తృప్తినిచ్చిన ఉద్యోగం మరొకటి లేదని ఖచ్చితంగా చెప్పగలను.రేపు మరిన్ని విశేషాలు.(సశేషం)
July 31, 2020 • T. VEDANTA SURY • Memories