ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన్ రావు తుమ్మూరి
October 1, 2020 • T. VEDANTA SURY • Memories

పాతపట్నం లక్ష్మీనరసింహ శ్రీరామాచార్యులు అని నేను రాస్తే మా కాగజ్ నగర్ మిత్రులే ఎవరండీ ఆయన అని ప్రశ్నిస్తారు.రామాచారి గారన్నా పి.యల్.యన్.శ్రీరామాచార్యులు గారన్నా కాగజ్ నగర్ వాసులకు సంగీతశిక్షకులు
గా,సంగీత కార్యక్రమాల నిర్వాహకునిగా, గాంధర్వ నికేతన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా,బాలవిద్యామందిర్ హిందీ మాధ్యమ ఉన్నతపాఠశాలలో సీనియర్ ఎకౌంటెంటుగా తెలుసు.
    రామాచార్యులవారి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా లోని పూళ్ల గ్రామం.
తల్లి రామసీతమ్మగారు ఎన్.సిహెచ్. రంగనాథ్, ఎన్.సిహెచ్. లక్ష్మణాచార్యుల అక్కయ్యగారు. రామాచా ర్యులు గారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఐదు నెలలకు జన్మించారు తండ్రి పాతపట్నం నర్సింహాచార్యులు ఉన్న ఊళ్లో గాంధ ర్వనికేతన్ పేరిట సంగీత పాఠశాల పెట్టి సంగీతం నేర్పించేవారు. దురదృష్టవ శాత్తు రామాచార్యుల వారి తొమ్మిదవ ఏట వారు పరమపదించటంతో ఉన్నత విద్యాభ్యాసం డిగ్రీదాకా ఏలూరులో మేనమామల దగ్గరే జరిగింది.దానితో పాటుగా తవ్లి వద్ద వర్ణాలు,మూడవ మేనమామ రంగనాథ్ గారి వద్ద లలిత సంగీతం నేర్చుకున్నారు.నలుగురు మేనమామల్లో పెద్దమేనమామ కోదండరామానుజాచార్యుల కూతురు
ఎన్.సి.రాజ్యలక్ష్మిని వివాహం చేసుకోవడంతో వారు పిల్లనిచ్చిన మామ కాగా,మూడో మేనమామ రంగనాథ్ సంగీత గురువు,నాలుగో మేనమామ లక్ష్మణాచార్యులకు తన సోదరిని ఇచ్చి వివాహం చేయటంతో ఆయన బావగారు కావటం,ఇలా ముగ్గురు మేన మామలతో ఆయనకు అనుబంధం ఉన్నది.రెండవ మేనమామ శ్రీనివాసాచార్యులు భద్రాచలం దగ్గిర స్థిరపడ్డారు.వారు హిందీ పండితులప మరియు నాట్యము తెలిసిన వారు.
      ఎన్.సిహెచ్.రంగనాథ్ గారు కాగజ్ నగర్ లోని సర్సిల్క్ యాజమాన్యంచే, శ్రీమతి మాలినీ ఛాందోర్కర్ గారి నేతృత్వంలో నడుస్తున్న హిందీ మీడియం పాఠశాల శిశుమందిర్ హైస్కూల్ లో సంగీత నృత్యాచార్యులుగా రావడంతో,వారి వెనుకే లక్షణాచా ర్యులుగారు వచ్చి,పేపరు మిల్లులో చేరటం,ఆ తరువాత రామాచార్యులు గారు వచ్చి కొంతకాలం సర్సిల్కులో పనిచేసి ఆ పరిశ్రమ కాలుష్యం పడక,స్థానిక బాలవిద్యామందిర్ పాఠశాలలో క్లర్కుగా చేరారు.అది పేపరుమిల్లు యాజమాన్యంలో నడుపబడే హిందీ మీడియం పాఠశాల.
ఆ యాజమాన్యం ఆధ్వర్యంలోనే నడిచే తెలుగు మీడియం పాఠశాలలో రామాచార్యులు గారి శ్రీమతి,రాజ్యలక్ష్మి గారు ఉపాధాయాయినిగా చేరారు.
   నేను కాగజ్ నగర్ వెళ్లిన కొత్తలో సంగీతం నేర్చుకోవాలన్న కోరికతో రంగనాథ్ గారింటికి వెళ్లటం అప్పుడందరూ ఒకే ఇంట్లో ఉండటం అలా వారితో నాపరిచయం మొదలైంది. సంగీతం నాకు అబ్బే విద్య కాదని మానుకున్నాను కాని వారితో స్నేహం మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. వయసుకు దగ్గరివాడవటంతో రామాచార్యులతో నాకు సాన్నిహిత్యం పెరిగింది.ఆయన ప్రతి కార్యక్రమంలో నన్ను కలుపుకు పోవడంతో అది మరింత బలపడింది.నాలోని సృజనకు శ్రీకారం చుట్టిన వారిలో రామాచార్యులు గారు అగ్రగణ్యులు.వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి తరువాతి భాగంలో ముచ్చటించుకుందాం.