ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సర్ సిల్క్ సరిగమలు- రామ్మోహన రావు తుమ్మూరి --ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడంటే నాలుగు ముక్కలయింది.కానీ ఒక్కటిగా ఉన్నప్పుడు (నేనక్కడ ఉన్నప్పుడు ఒక్కటే) ఒక సాంస్కృతిక విప్లవం తెచ్చిన వ్యక్తి డి.సురేశ్ కుమార1979 లో అనుకుంటా ఆయనను నేను మొదటి సారి ఆసిఫాబాదులో ఒక పెళ్లిలో కలుసుకున్నాను.విడిదిలో కలుసుకున్నప్పుడు ఇద్దరం మా మా నాటకాను భవాలను మనసారా పంచుకున్నాం.తరువాత ఆసిఫాబాదులో వారి సంస్థ నవజ్యోతి కల్చరల్ అకాడమీ అధ్వర్యంలో జరిగిన నాటికల పోటీలకు ‘మానవతా నీవెక్కడ’అనే నాటికలో పాత్రధారుడిగా వెళ్లాను.అప్పుడే మడిపల్లి భద్రయ్య గారిగోండురైతు ఏకపాత్ర చూశాను.ఆ ప్రాంతంలో అప్పట్లో అంత ఘనంగా నాటకోత్సవాలు చూడటం నాకు అదే మొదటి సారి.అప్పుడే డి.సురేశ్ కుమార్ లోని నాయకలక్షణం కనిపెట్టి మనసులో అనుకున్నాను.ఇంటి పేరు దండనాయ కులకు సార్థకతను చేకూర్చే వాడని. చిన్న ఈడులోనే రెవిన్యూ శాఖలో చేరి ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు మరోవైపు సాంస్కృ తిక కార్యక్రమాల నిర్వహణ ఎంతో నేర్పుగా నిర్వహిస్తూ జిల్లాలోని అనేక మంది కళాకారులను ప్రోత్సాహపరచటం అతి త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య ఏర్పరచి కార్యక్రమాలు నిర్వహించటం,కళాకారులలో ఉత్సాహం నింపటానికి సినీ కళాకారులను ఆహ్వానించటం చూస్తుండగానే డి.సురేశ్ కుమార్ పేరు జిల్లా వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. అదిగో అప్పుడు ఆయనకు కాగజ్నగర్ రెవెన్యూ ఆఫీసుకు బదిలీ అయింది.అప్పటికి కాగజ్ నగర్ లో ఉన్న నాటక సమాజాలు ఎవరి దారిలో వారు వారికి తోచిన విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగేది.సమాజాల మధ్య సయోధ్య ఉండేది కాదు.ఇదంతా గమనించి కళాకారులంతా ఒకరికొకరుతోడ్పాటు అందించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అన్ని సమాజా లవారిని ఏకత్రితం చేసి లలిత కళా సమాఖ్య ఏర్పాటు చేశారు.అప్పటికేజిల్లా సాంస్కృతిక శాఖ మెల్ల మెల్లగా విస్తరిల్లుతున్నది.అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతున్నది. దానికి అనుబంధంగా లలిత కళా సమాఖ్యను చేర్చి కాగజ్ నగర్ సమాఖ్య తొలి కార్యక్రమంగా ఆయన రచించిన ‘క్విట్ ఇండియా ‘వీధినాటిక (స్ట్రీట్ ప్లే) టేకప్ చేయడం జరిగింది.కాగజ్ నగర్ లో లలిత కళా సమాఖ్య ఏర్పడినప్పుడు చిన్నా పెద్దా అన్నీ కలిపి16,17 కళా సమాజాలున్నట్లు తెలిసింది.నాకు గుర్తున్నంతలో1.లలితకళాసమితి.2.ఫ్రెండ్స్ క్లబ్.3.శారద నాట్య కళామం డలి. 4.శ్రీనివాస కళాసమితి.6.జి.పి. ఆర్ట్స్. 7.చైతన్య కళా సమితి. 8.కళా భారతి.9.నటరాజ కళా సమితి.10. భారత భారతి.11.గాంధర్వ నికేతన్12.తెలుగు సాహితీ సదస్సు 13.నట నాలయ 14.దాసరి రామకృష్ణారావు గారి ఆర్ట్ సంస్థ(పేరు గుర్తు లేదు)ఇంకా ఒకటి రెండు సంస్థలేవో ఉండేవి.వీటిలో కొన్ని మాత్రమే నాటక సమాజాలు కాగా మిగతావి సంగీత,సాహిత్య,నృత్య చిత్రలేఖన సంస్థలు.నాటకాలు వేసే సమాజాలలోని దాదాపు పది మంది దాకా ఆ నాటికలో ఎంపికైనారు.దానికి దర్శకత్వ బాధ్యత పల్నాటి పాంచజన్యం గారు వహించారు.లలిత కళా సమాఖ్య అధ్యక్షులుగా ఇ.ఎస్.ఐ.ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మధ్యాహ్నం విజయమోహన్ రావు, కార్యదర్శిగా నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్ గారు, సాంస్కృతిక కార్యదర్శిగా పల్నాటి పాంచజన్యం గారిని ఎన్నకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులుగా అన్ని సమాజాల వారం ఉన్నాము. కృష్ణకట్టి, దామోదర్ వంటి కొందరు వ్యక్తిగత సభ్యులుగా సమాఖ్యలో ఉండటం జరిగింది.అలా తొలి సారిగా కాగజ్ నగర్ వీధులలో క్విట్ ఇండియా వీధి నాటిక ప్రదర్శించి పలువురి ప్రశంసలను పొందింది.అది వీధి నాటిక గనుక అందరికీ ఒకే రకమైన దుస్తులు కుట్టించడానికి స్థానిక సినిమా హాలు యజమాని రాంమోహన్ రావు గారినిండి వేయి రూపాయల విరాళం సేకరించడంల జరిగింది.ఆ నాటిక జిల్యావ్యాప్తంగా అనేక చోట్ల యాభైకంటే పైగా ప్రదర్శనలు ఇవ్వగలిగిందంటే దానికి మూలకారణం మా దండనాయకుల సురేశ్ కుమార్ అన్నదిఅక్షర సత్యం.ఆ తరువాత ఆయన సంచలనాత్మకంగా జిల్లా కళాకారులకు ప్రాధాన్య కల్పిస్తూ నిర్మించిన నాగబాలటెలివిజన్ సీరియల్ ఆయన ఇంటిపేర మార్చేంతనే కాదు ఆయన ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని బుల్లితెర రంగంలోనికి మారిపొయ్యేంత ఘనవిజయం సాధించింది.ఆ తరువాతఆయన హైదరాబాదు చేరుకొని టివి రంగంలో అంచెలంచెలుగా ఎదిగి,ఆదిపరాశక్తి,ఆత్మయాత్ర,శాస్త్రం శస్త్రం వంటి ధారావాహికలు,కొమురం భీం,వీరనారి చాకలి ఐలమ్మ వంటి టెలీ ఫిలిం లు నిర్మించటమే గాక ఎనిమిది వందలకు పైగా డాక్యుమెంటరీ ఫిలిమ్స్ నిర్మించి 13 నందులను కైవసం తేలుకున్న ప్రతిభాశాలి. నటుడుగా , నిర్మాతగా,దర్శకుడిగా నా కళ్లముందే ఎదిగిన మంచి మిత్రుడు ఆ తరువాత బంధువు కూడా అయిన సురేశ్ కుమార్ఈ రోజు తెలంగాణ గర్వించదగిన స్థాయిలో బుల్లితెర రంగానికి చెందిన అగ్రగణ్యులలో ఒకరు కావడం ఆ జిల్లా కళాకారుడిగానేను గర్వించే విషయం.ముఖ్యంగ ఆయన విజయ పరంపర రాస్తే ఒక ఉద్గ్రంథమే అవుతుంది. స్థాలీ పులాక న్యాయంగా మాత్రమే తెలియ జేసాను.ఆయన రచనా రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర నేసుకున్నన వారు. ఇతిప్రచోదయాత్, మార్చ్ ఫాస్ట్,క్విట్ ఇండియా వంటి నాటికలు,నిన్ను నీవు తెలుసుకో గేయశతకము,తెంగాణా మహనీయులు, తెలంగాణ కోటలు ఆసిఫాబాదు చరిత్ర వంటి వచనరచనలు వెలువరించటంవారి బహు ముఖ ప్రజ్ఞకు ఉదాహరణ.జిల్లా లోని అనేక మంది కళాకారులకు బుల్లి తెరమీద కనిపించే అవకాశం కల్పించిన నాగబాల సురేశ్ కుమార్రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక మందికి ఉపాధి కల్పించి ఆదుకున్న ఉత్తముడు.నాకు కొమురం భీములో మరియు చాకలి ఐలమ్మలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిటమే గాక పలు సభల్లో వ్యాఖ్యాతగా పరిచయం చేసిన వ్యక్తి.వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకునే ఆదిలాబాదు జిల్లా వెనుకబడింది కాదు మీ అందరికంటే ముందు నడిచేది అని ఆత్మవిశ్వాసంతో నిరూపించిన వ్యక్తి నాగబాల సురేశ్ కుమార్ ఉరఫ్ దండనాయకుల సురేశ్కుమార్ ఆసిఫాబాదు తేజం.
August 13, 2020 • T. VEDANTA SURY • Memories