ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సాయంత్రం ఆరు గంటలకు ఇలా ఉండే సుల్తాన్ బజార్ ను కూడా చూసే ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. బజార్ లో అడుగు పెట్టగానే నాడాలు, పిన్నులు, దస్తీలు పట్టుకుని ఆంటీ, దీదీ అని చుట్టూ మూగే పిల్లలంతా ఏమయిపోయారు? రానివ్వట్లేదా? వాళ్ళే రావట్లేదా? ఏం చేస్తున్నారో? ఆ ఇళ్ళ పొయ్యిలో పిల్లి లేచిందో! అదుగో ఆంటీ అన్నావు కాబట్టి నీ దగ్గర కొనను. దీదీ అంటేనే కొంటాను అని వాళ్ళతో కొట్లాడిన రోజులు మళ్ళీ వస్తాయా? ఆంటీ అన్నాసరే కొంటాను రండి అనరవాలనిపించింది ఆఖాళీ ఫుట్ పాత్ లను చూస్తుంటే.- వనజ . సి.
June 24, 2020 • T. VEDANTA SURY • Memories