ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సాహితీ గౌతమి పూర్వాధ్యక్షుడు, కవి రచయిత, పరిశోధకుడు డాక్టర్ బి దామోదర రావు వర్ధంతి నేడు* ఆయనను స్మరించుకుందాం. : -మాడిశెట్టి గోపాల్
August 23, 2020 • T. VEDANTA SURY • News

కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం లోని గూడెం గ్రామంలో జన్మించిన డాక్టర్ బి దామోదరరావు ఎం. ఏ., ఎంఫిల్., పి హెచ్ డి పూర్తి చేసి తెలుగులో పి.జి జర్నలిజం కూడా చేశారు. కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్ తో పాటు అనేక కళాశాలలలో తెలుగు ఉపన్యాసకునిగా పనిచేశారు. సొంత ఊర్లో రవీంద్ర సాహితి మండలి తో ప్రారంభించి ఉస్మానియా రచయితల సంఘం, సాహిత్య వికాస సమితి, జానపద సాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలలో వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం జానపద సాహిత్య పరిషత్ వరంగల్ శాఖ కార్యదర్శిగా, కరీంనగర్ సమతా సాహితి సాహితీ గౌతమి సంస్థల అధ్యక్షునిగా విశేషమైన సాహితీ సేవ చేశారు. ముఖ్యంగా జానపద సామెతల మీద అనేక పుస్తకాలు రాశారు. వార్త దినపత్రికలో మొగ్గ శీర్షిక కింద ఈ సామెత మీకు తెలుసా పేరుతో అనేక సంవత్సరాలు సామెతలను పరిచయం చేశారు. ఆయన రచనలు విపుల, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, మయూరి, సుప్రభాతం మొదలైన వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. సింగిడి కథా సంపుటి, నా కవిత సమత కవిత్వ సంపుటి, తెలుగు జానపదుల సామెతలు, తెలుగు సామెతలు జానపద సంస్కృతి, జానపద విజ్ఞానం పరిశోధన, కథలు కథలుగా సరదా కథలు, ఈ సామెత మీకు తెలుసా, గ్రామీణ క్రీడలు తదితర గ్రంథాలను వెలువరించారు. ఆధ్యాత్మిక అంశాలతో పుస్తకాన్ని  రాశారు.  గౌతమి అవార్డు,  వట్టికోట ఆళ్వారుస్వామి పురస్కారం అనేక సత్కారాలు పొందారు. ఆయన సొంత ఇంట్లోనే జర్నలిజం కళాశాల ను నిర్వహించారు. షష్టిపూర్తి సందర్భంగా  ప్రత్యేక సంచిక వెలువరించారు. సాహితీ గౌతమి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వార్షికోత్సవ సంచికను వెలువరించారు. 2013 ఆగష్టు 23 న పరమపదించారు. ఆయనకు ప్రగాఢ నివాళులు