ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ప్రజా సౌకర్యార్థం సొంత డబ్బులతో ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావుగారు ప్రారంభించారు.- మంత్రి హరీశ్ రావు గారి సూచనలు - కషాయం తాగండి. కరోనాను జయించండి. ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని ప్రజలకు మంత్రి హరీశ్ రావు గారి పిలుపు.- కరోనా నియంత్రణకై పట్టణంలోని ప్రతీ హోటల్, రెస్టారెంట్లలో వేడినీళ్లు అందివ్వాలని మంత్రి వెల్లడి.- సిద్ధిపేట పట్టణంలో ఉచిత కషాయ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.- కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ అందిస్తున్నాం.- వేసవి కాలంలోచలి వేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నట్లు, ఇవాళ వేడినీరు, కషాయ వితారణ కేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నాం.- కరోనా కష్ట కాలంలో ప్రజలు బయటకు రాకూడదు.- అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావొద్దు. స్వీయ నియంత్రణ పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి పిలుపు.- యోగా, వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగా ఉంటున్నారు.- సిద్దిపేటకు వివిధ పనుల కోసం వచ్చే వారి కోసం పట్టణంలో మూడు చోట్ల వేడి నీటి కేంద్రాలను ప్రారంభిస్తున్నాం.- కరోనా నుంచి బయట పడాలంటే వేడి నీరు, కషాయం తాగితే.. సులువుగా బయట పడవచ్చు.- కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ అందిస్తున్నాం.- కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలాది రూపాయల ఖర్చు చేయొద్దు.- ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలి. - సిద్దిపేటలో 100 పడకల కొవిడ్, గజ్వేల్ ఆర్వీఏం ఆసుపత్రిలో వంద పడకలు, సంగారెడ్డి ఏంఎన్ ఆసుపత్రిలో 100 పడకలతో కరోనా ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులు ఉన్నాయి.- కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలి.- ఉండ్రాళ్ళ రాజేశం
July 26, 2020 • T. VEDANTA SURY • News