ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సిస్టర్ సుబ్బలక్ష్మి---త్యాగరాయనగర్ (మద్రాసు) లో మా నాన్నగగారు తెలుగు మాష్టారుగా శ్రీరామకృష్ణామిషన్ వారి శారదా విద్యాలయ బాలికల పాఠశాలలో పని చేశారన్న విషయం గతంలో చెప్పాను. అయితే ఆ స్కూలు వెనుక సిస్టర్ సుబ్బలక్ష్మి (1886 ఆగస్టు 18 - 1969 డిసెంబర్20) ది ప్రధాన పాత్రుంది. కనుక ఆమె గురించి నాకు ఒకటి రెండు మాటలు చెప్పాలనిపించింది ఈమారు.మహిళా లోకం కోసం సిస్టర్ సుబ్బలక్ష్మిగారు చేసిన కార్యక్రమాలు అనేకం.దక్షిభారత దేశంలో డిగ్రీ పొందిన మొట్టమొదటి మహిళామణి సుబ్బలక్ష్మిగారు. మద్రాసు మైలాపూరులో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మిగారుతండ్రి పేరు సుబ్రమణ్య అయ్యర్. ఆయన ఓ ప్రభుత్వోద్యోగి. తల్లి పేరు విశాలాక్షి.సుబ్మమణ్య అయ్యర్ దంపతుల మొదటి సంతానమే సుబ్బలక్ష్మిగారు. వీరి కుటుంబం తంజావూరులోని వైగళత్తూరు ప్రాంతానికి చెందినది.సైదాపేట (మద్రాసు) లో ప్రాథమిక విద్య చదువుకున్న సుబ్బలక్ష్మిగారు1898 లో ఆమెకు వివాహమైంది. ఖానీ కొద్దికాలానికే భర్తను కోల్పోయారు. అయితే చదువు మీది ఆసక్తితో ఆమె ఎగ్మూరులో ఉన్న ప్రెసిడెన్సీ ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు.1905 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో అన్ని సబ్జెక్టులలోనూ ఫస్టు మార్కులు పొందిన సుబ్బలక్ష్మిగారు వీణ వాయించడం లోనూ శిక్షణ పొందారు.జార్జిటౌన్లోని ప్రెజంటేషన్ కాన్వెంటులో ఎఫ్.ఎ. కోర్సులో చేరారు. అనంతరం బి.ఎ. చదివి దక్షిణ భారత దేశంలోని బ్రాహ్మణకుటుంబంలో డిగ్రీ పొందిన తొలి మహిళగా రికార్డు పుటలకెక్కారు.పన్నెండో ఏట భర్తను కోల్పోయిన ఆమె "వితంతువు " అనే మాట బదులు సిస్టర్ అని పిలిచేలా నాటి సమాజంలో ఓ మార్పు తీసుకొచ్చారు. భర్తలను కోల్పోయిన స్త్రీలను సిస్టర్ అని పిలిచేలా చేశారు. వారిపట్ల గౌరవంగా ప్రవర్తించాలని అనేక సభలలో చెప్పుకొచ్చారు. సమాజంలో మహిళల కోసం సంస్కరణలు తీసుకురావడంలో విజయవంతమైన సుబ్బలక్ష్మిగారు భర్తలను కోల్పోయిన బ్రాహ్మణ మహిళల సంక్షేమం కోసం ఎగ్మూరులో శారదా లేడీస్ యూనియన్ ప్రారంభించారు. తనను కలసిన ప్రతి ఒక్కరికీ ఆమె సహాయసహకారాలు అందించారు. ఆమె ఓ నివాసాన్ని ఏర్పాటు చేసి పుస్తక పఠనం కోసం ప్రత్యేకించి ఓ గది కేటాయించొరు. తొను చదవడమే కాకుండా ఇతర మహిళలతోనూ పుస్తకాలు చదివించారు.ప్రభుత్వ విశాఖలో చేరిన ఆమె ట్రిప్లికేన్ ప్రభుత్వ సెకండరీ ట్రైనింగ్ పాఠశాలను విజయవంతంగా నిర్వహించారు. దాంతో ఎగ్మూరులో ఉండిన శారదా లేడీస్ యూనియన్ కార్యకలాపాలను ట్రిప్లికేన్ లోని టి.పి. కోయిల్ స్ట్రీటుకి మార్చారు. ఈ హోమ్ లో చేరిన వారిని ట్రిప్లికేన్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఐస్ హౌస్ లో కొత్తగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో 1897లో ఈ కేంద్రాన్ని స్వామి వివేకానంద సందర్శించారుకూడా. తర్వాత ఈ కేంద్రం చేతులు మారుతూ వచ్చింది చివరికి 1915లో ప్రభుత్వం ఎనభై వేల రూపాయలకు ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసి దానిని సుబ్బలక్ష్మిగారికి నిర్వహణా బాధ్యతలను అప్పగించారు. ఆమెతో మరికొందరు మహిళలు చేతులు కలిపారు.మరోవైపు ట్రిప్లికేన్ పరిధిలోని జాలర్ల పిల్లల చదువు సంధ్యలకోసం ఓ స్కూలు ప్రారంభించారు. ఇలా అక్కడ కుప్పం స్కూలు ఏర్పడింది. తర్వాతి కొలంలో ఈ స్కూలు పేరు లేడీ విలింగ్డన్ హైస్కూలుగా మారింది. అప్పటి మద్రాస్ గవర్నర్ భార్య పేరది.ట్రిప్లికేన్ లోనే వేంకటరంగం పిళ్ళయ్ స్ట్రీట్ లో ఆమౄ శారదా విద్యాలయ పేరుతో కొత్తగా ఓ స్కూలు ప్రారంభించారు. 1938 లో ఈ స్కూలుని రామకృష్ణామిషన్ కి అప్పగించారు.అనంతరం ఇక్కడి నుంచి మాంబళంకి ఈ స్కూలు మారింది. తర్వాత అక్కడి నుంచి టీ. నగర్లోకి మార్చారు.మద్రాసు ప్రెసిడెన్సీలో అనేక్ విద్యాలయాలను నెలకొల్పిన సుబ్బలక్ష్మి కృషిలో భాగంగానే చివరి విద్యాసంస్థ మైలాపూరులోని విద్యామందిర్ స్కూలు. ఇది 1956 లో ప్రారంభమైంది. 1952 నుంచి 1956 వరకూ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగొనూ ఉండిన ఆమె 1969లో తుదిశ్వాస విడిచారు.ఆమె సహాయ సహకారాలతో ఎందరో వితంతువులు టీచర్లయ్యారు. నర్సులయ్యారు. కొందరైతే డాక్టర్లయ్యారు. వీరందరూ ఆమెను ఆదర్శమహిళగా చేసుకుని మహిళల అభ్యున్నతికోసం ఎనలేని కృషి చేశారు.ఐస్ హౌస్ లో ఒకానొకప్పుడు ఆమె పర్యవేక్షణలో ఉండిన నివాసం రామకృష్ణా మఠానికి అప్పగించగా మఠంవారు దొనిని స్వామి వివేకానంద స్మృత్యర్థం ఆ భవనాన్ని వివేకానంద హౌస్ గా మార్చారు.చివరి రక్తపు బొట్టు వరకు మహిళల సంక్షేమకోసం తన శక్తినంతా ధారపోసిన సిస్టర్ సుబ్బలక్ష్మిగారికి జోహార్లు. - యామిజాల జగదీశ్
August 10, 2020 • T. VEDANTA SURY • Memories