ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సీఏబీజీ సర్జరీ: ప్రమోద్ ఆవంచ
August 30, 2020 • T. VEDANTA SURY • Serial

 కొరొనరీ హార్ట్ డిసీజ్ లక్షణాలు వుండి హార్ట్ఎటాక్ వచ్చిన పరిస్థితులలో సీఏబీజీ సర్జరీ చేస్తారు.హార్ట్ఎటాక్ తో గుండె పనితీరు తగ్గిపోతే, మరియు కొరొనరీ ఆర్టరీలు కొవ్వు, కాల్షియం లతో మూసుకుని పోతే ఈ సర్జరీ తప్పనిసరి.అంతే కాకుండా గుండె రక్తాన్ని ఇతర శరీర భాగాలకు సరఫరా చేయలేక బలహీన పడినప్పుడు, రోజువారీ జీవిత శైలిలో ఎలాంటి మార్పులు లేకపోవడం, మందులు పని చేయక పోవడం వల్ల కూడా ఈ సర్జరీ చేస్తారు.ఎలాంటి పరిస్థితులలో సర్జరీ చేయాలో డాక్టర్లు నిర్ణయిస్తారు, అంటే,-కొరొనరీ ఆర్టరీ డిసీజ్ లక్షణాలు ఎక్కువగా వున్నప్పుడు
- ఆర్టరీస్ లలో మల్టీపుల్  బ్లాకులు వున్నప్పుడు
- మిగితా ట్రీట్మెంట్ లలో పేషెంట్ స్పందన ను పరిగణనలోకి
  తీసుకుంటారు.
- ఇంకా ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు పేషెంట్ వున్నాయా అని తెలుసుకుంటారు.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు పేషెంట్ కు అత్యవసర పరిస్థితుల్లో కూడా సీఏబీజీ సర్జరీ చేస్తారు.
 డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి పేషెంట్ ను సీఏబీజీ సర్జరీకి అర్హుడో కాదో నిర్ణయిస్తారు.ముందు కొన్ని శరీరపరమైన పరీక్షలు చేస్తారు.
ఆ తరువాత గుండె, ఊపిరితిత్తులు, పల్స్ రేటును చెక్ చేస్తారు.
ఛాతిలో నొప్పి, ఊపిరి పీల్చుకునడంలో ఇబ్బంది వంటి సమస్యలు వున్నాయా వుంటే ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు,అని అడిగి తెలుసుకుంటారు.ఆర్టరీలు ఎంత శాతం మూసుకుపోయాయో పరీక్షలు చేసి తెలుసుకుంటారు.
                         మిగితాది రేపు.