ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సీతాఫలం ఔషధంగా..: పి కమలాకర్ రావు
November 6, 2020 • T. VEDANTA SURY • health tips

 సీతాఫలం చాలా రుచికరమైన తీయని పండు. ఈ పండును గర్భిణీ స్త్రీలు తింటే కడుపులో పెరుగుతున్న పిల్లల మెదడు కు బలం చేకూరుస్తుంది. సీతాఫలం గుజ్జు లో పాలు చక్కెర కలిపి త్రాగితే మంచి శక్తినిస్తుంది పచ్చి సీతాఫలంలో కొబ్బరి నూనె కలిపి తైలం గా కాచి చల్లార్చి తలకు రుద్దితే చుండ్రు తగ్గిపోతుంది. పేలు కూడా రాలి పడిపోతాయి. ఈ తైలం రాస్తే సోరియాసిస్ కూడా తగ్గి పోతుంది. సీతాఫలం ఆకు ను దంచి ముద్దగా చేసి సెగ గడ్డల పై కట్టుగా కడితే తగ్గిపోతాయి సీతాఫలం గింజలను మెత్తగా దంచి మేక పాలతో కలిపి బట్ట తల పై రాస్తే వెంట్రుకలు మొలుస్తాయి.  పంటి నొప్పి ఎక్కువ అయినప్పుడు సీతాఫలం ఆకు ను ముద్దగా చేసి నొప్పి పై అదిమి పెట్టుకోవాలి. పంటి నొప్పి తగ్గిపోతుంది పంటి నొప్పి తగ్గిపోతుంది. సీతాఫలం పచ్చికాయ గింజల రసాన్ని తీసి పంటలపై క్రిమిసంహారిణిగా వాడుతారు..