ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుదేశమిత్రన్--దక్షిణ భారత దేశ భాషలలో విడుదలైన తొలి వార్తా దిన పత్రిక సుదేశమిత్రన్. ఇది తమిళ పత్రిక. 1882 లో విడుదలైంది. జి. సుబ్రమణ్య అయ్యర్ దీనిని ప్రారంభించారు. ఆయనే ఈ వ్యవస్థాపక సంపాదకుడు. ఒక్క తమిళనాడులోనే కాకుండా బర్మాలోనూ శ్రీలంకలోనూ సింగపూరులోనూ, మలయాలోనూ ఈ పత్రిక సర్క్యులేషన్లో ఉండేది. అలాగే చైనా, తూర్పు ఆఫ్రికాలోకూడా ఈ పత్రికను విక్రయించేవారు. స్వదేశమిత్రన్ అనే మాటనే సుదేశమిత్రన్ అని అనేవారు తమిళంలో.మహాకవి సుబ్రమణ్యభారతి తన 22వ ఏట (1904లో) ఈ పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారు. కానీ పత్రికాధిపతి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలుండటం నచ్చక సుబ్రమణ్య భారతి 1906లో ఈ పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఆయన బయటకు వచ్చేసిన తర్వాత పంజాబులో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రభుత్వ అనైతికతను విమర్శిస్తూ ఈ పత్రికలో ఎడిటర్ సుబ్రమణ్య అయ్యర్ అనేక వ్యాసాలు రాశారు. దాంతో ఆయనను అరెస్టు చేసి జైలులో బంధించారు. 915లో ఈ పత్రికను ది హిందూ అధినేత కస్తూరి రంగన్ సమీప బంధువైన రంగస్వామి కొనుగోలు చేశారు. ఆతన సారద్యంలో ఈ దినపత్రిక కొత్త రూపురేఖలతో వెలువడిఃది. సీఆర్. శ్రీనివాసన్ బిజినెస్ మేనేజరుగా బాధ్యతలు చేపట్టారు. సుబ్రమణ్య భారతి1920లో ఈ పత్రికకు సంపాదకుడిగా చేరారు. 1962 లో శ్రీనివాసన్ మరణించిన తర్వాత ఈ పత్రిక నవతరం చేతుల్లోకి మారింది. అయితే దినత్తంది వంటి పత్రికలతో పోటీపడలేక ఈ పత్రిక 1970.లో మూతబడింది.ఇరవయ్యో శతాబ్దంలో తమిళ సాహిత్యాభివృద్ధికి ఈ పత్రిక ఎంతగానో కృషి చేసింది. అలనాటి ప్రముఖ రచయితలు కె. ఎన్. సుబ్రమణ్యం, ము. వరదరాజర్, ఎస్.డి.ఎస్.యోగి తదితరులెందరో ఈ పత్రికలో రాస్తుండేవారు. కథలు, వ్యాసాలు, కవితలకోసం ప్రత్యేక అనుబంధాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత ఈ పత్రికకు దక్కింది. 1929లో ఈ అనుబంధాన్ని ప్రవేశపెట్టారు. తమిళ నవలా ప్రపంచులో విశిష్ట నవలగా ఇప్పటివరకూ నిలిచిన మోహముల్ ఈ పత్రికలోనే.ధారావాహికంగా వెలువడింది. ఈ నవల రచయిత తి. జానకిరామన్. తమిళనాడు ముఖ్యముత్రిగా రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న కీ.శే. ఎం. కరుణానిధి రాసిన పరబ్రహ్మం కూడా ఈ పత్రికలోనే అచ్చయింది.- యామిజాల జగదీశ్
June 26, 2020 • T. VEDANTA SURY • News