ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౧౦౩-103)
August 27, 2020 • T. VEDANTA SURY • Poem

వేసరపు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి ! వ్యర్ధుడు గానీ
దాసి కొడుకైన గానీ
కాసులు గలవాఁడె  రాజు! గదరా సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ.....
*వీసరపు జాతి=తక్కువ జాతి;     వీసము = అతి తక్కువ ప్రమాణము* 
తక్కువ కులములో పుట్టిన వారైనా; తాను వీసమెత్తు విలువ చేయని వాడైనా;  దాసి కి పుట్టిన వాడైనా; ఎవరైనా తన దగ్గర ధనం వున్నవాడే రాజు..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*అవును, "ధన మూలం ఇదం జగత్" అని కదా నానుడి.*
*మన సమాజంలో రెండు మార్గాలలో ధనం సంపాదించిన వారినే రాజులుగా గుర్తిస్తారు.* *౧.ప్రాపంచిక విషయాలలో వుపయోగ పడే ధనరాశి. లక్ష్మి. ఈ సంపదవల్ల వచ్చే రాచరికం, మర్యాద, ఆనందం అన్నీ కూడా క్షణకాలం మాత్రమే వుంటాయి. అందుకే ప్రతి రోజూ తమ భగవత్ ప్రార్ధనలో "నా జీవనం సాగించడానికి సరిపడినంత డబ్బు మాత్రమే నాకు సమకూర్చు దేవా" అని మన పెద్దవారు ప్రార్ధించేవారు.*
*౨.రెండవ మార్గం లో వచ్చే ధనం, నిత్యం, శాస్వతం, చిరంతనంగా మనతో వస్తుంది. ఇది ఆధ్యాత్మిక ధనం. దీనికి దొంగిలింపబడే భయం లేదు. ఈ ధనం పంచిన కొద్దీ పెరుగుతునే వుంటుంది. ఈ సంపద సంపాదించడానికి సద్గురువు తోడు, భగవత్ కృప, పట్టుదలతో కూడిన కృషి వుండాలి.*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss