ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౧౦౫-105)
August 29, 2020 • T. VEDANTA SURY • Poem

సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక ! బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చు కొరకు ! తథ్యము సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ.....
మితి మీరిన అనురాగం, ప్రేమ, ఆప్యాయతల ప్రదర్శన విరసము, పోట్లాటకు దారి తీస్తుంది.  అపరిమిత సుఖాలు కలిగితే వాటి వల్ల ఇబ్బందులు, కష్టాలు వెంటనే ఏర్పడుతాయి.  ఎదైన స్థాయికి మించి పెరిగితే విరగడం ఖాయం.  వస్తువుల ధరలు విపరీతంగా తగ్గుతూ వుంటే కచ్చితంగా పెరుగుతాయి. ఇలా నిక్కముగా జరుగుతుంది ..... అని సుమతీ శతకకారుని వాక్కు.
అందుకే కదా *"అతి సర్వత్ర వర్జయేత్"* అని.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss