ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౧౦౬-106)
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని ! మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసిపోవుఁ గాని ! నెగడదు సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ.....
చేసిన మేలును గుర్తు వుంచుకోని వానిని, పంచముని, కంసాలి వానిని, మంగలిని తమ రాజ్యానికి మంచి చేసే వారుగా భావించి రాజ్యం చెసిన రాజు యొక్క రాజ్యం మట్టిలో కలసి పోతుంది కానీ అభివృద్ధి చెందదు ..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*ఎవరి స్థాయి, తెలివితేటలు, నేర్పరితనము తెలుసుకుని వారి చేత ఆయా పనులు చేయించినపుడే అభివృద్ధి జరుగుతుంది.  కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, గుర్రం పని గుర్రం చేయాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss