ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౧౦౮-108)
September 2, 2020 • T. VEDANTA SURY • Poem

స్త్రీల యెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమి చేసి ! భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నింద సేయ ! కెన్నడు  సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ...
ఆడవారితో వాదనలకు దిగకూడదు.  చిన్న మన పిల్లతో స్నేహం గా వున్నా  వారిలాగా చిలిపి పనులు, మాట్లాడటం చేయకూడదు.   నీవైన మంచి గుణాలు, లక్షణాలను వదలకూడదు.  నీకు పని ఇచ్చిన యజమానిని ఎప్పుడూ దూషించకు..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*ఆడవారి కి ఏమీ తెలియదు అనే చులకన భావంతో వారితో వాదించ కూడదు. ఎవరో చెప్పినట్టు, "పాలిచ్చే తల్లులు, పాలించడం తెలియదా" అని గుర్తెరిగి వుండాలి.  చిన్నతనం చేష్టలు చేస్తూ చిన్నతనం అవకూడదు. మనకు అన్నం పెడుతున్న వ్యక్తి ని, వ్యవస్థ ను ఎప్పుడూ చులకన చేయకూడదు, కువిమర్శ చేయకూడదు* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss