ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౮౪-84) పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్ధములున్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... ఈ భూమి మీద మనదైన రోజున మనం అడవులలో వున్నా అన్ని సుఖాలూ అమరుతాయి. అదృష్టం మనవైపు లేనపుడు ఎంతో ఎత్తుకు చేరాలని మేరు పర్వతం ఎక్కినా ఏమీ లాభించదు. ...... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. *మనది కాని రోజున, తాడే పామై కరుస్తింది. అదే విధి, మనకు అనుకూలంగా వున్నప్పుడు, మనం ఏమీ చేయకుండా మిన్న కున్న కూడా మనకు రావలసినవి, మన దగ్గరకు, తామై వస్తాయి. విధి నిర్ణయం ఎలా వుంటే అలాగే జరుగుతుంది* అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 2, 2020 • T. VEDANTA SURY • Poem