ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౮౫-85) పొరుగునఁ బగవాఁ డుండిన నిరవొందక వ్రాఁతకాఁడె యేలికయైనన్ ధరఁ గాపు కొండె మాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... కరణాలకు వచ్చే ఇబ్బందుల గురించి చెప్తున్నారు, శతకకారుడు. కరణం ఇంటి పక్కన, వాని శతృవు వున్నా, పన్నల వసూళ్ళు సరిగ్గా లెక్క కట్ట కలిగిన వాడు కరణానికి యజమాని ఐనా, పన్నులు చెల్లించే వారు అబద్దాలు ఆడే వాళ్ళు ఐనా, కరణాలు తమ ఇష్టానికి పని చేయడం కుదరదు...... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 3, 2020 • T. VEDANTA SURY • Poem