ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౮౬-86) బంగారు కుదువఁ బెట్టకు సంగరమునఁ బారిపోకు సరసుడ వైనన్ అంగడి వెచ్చము లాడకు వెంగలితోఁ జెలిమి వలదు వినురా సుమతీ! వెంగలితో = నీచునుతో తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... బంగారాన్ని కుదువ బెట్టకు. యుద్ధంలో నుంచి / పోరాటంలో నుంచి పారిపోకు. తెలివి గల వాడివి ఐతే వ్యాపారుల వద్ద అప్పు పెట్టకు. నీచునితో స్నేహం చేయకు ...... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. *పోరాటంలో వెన్ను చూపి పారిపోవడం, మరణంతో సమానం. అలాగే, నీచునితో స్నేహం చేయడం కూడా. మన స్థాయికి మించి బ్రతుకు గడపడానికి, బంగారాన్ని కుదువ పెట్టినా, వ్యాపారుల వద్ద అప్పు చేసినా, అది నేల విడిచి సాము చేయడం వంటిదే* అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 4, 2020 • T. VEDANTA SURY • Poem