ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౮౯-89) మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలిచుఁ దరచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ..... ప్రజలకు/రాజ్యానికి మేలు చేసే ఆలోచనలు చెప్పే మంచిబుద్ధ కలిగిన మంత్రి వుంటే ఆ రాజ్యం పది కాలాలు గొప్పగా వర్ధిల్లుతుంది. అలా కాకుండా, మహారాజు మెప్పుకోసం, తన స్వార్ధం కోసం పనికి వచ్చే ఆలోచనలు చెప్పే వాడు మంత్రి గా వుంటే ఆ రాజ్యం లో పాలన కుంటు పడుతుంది. రాజ్యం కూడా పరహస్త గతం అయ్యే అవకాశాలు చాలా వుంటాయి. ఎలా అంటే, ఒక పెద్ద యంత్రన్ని పట్టి వుంచే కీలు (స్క్రూ / మర) ఊడిపోతే ఆ యంత్రము పని చేయదు. ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. *ఒక రాజ్యం లో ఎవరు ఏపని చేయడానికి నియమించ బడ్డారో, వారు తమ స్వార్ధం, తమ లాభాపేక్ష లేకుండా, రాజ్యం కోసం పని చేస్తే, ఆ రాజ్యం, ఆ సమాజం చక్కగా ముందుకు అభివృద్ధి దిశగా కదులుతాయి* అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 6, 2020 • T. VEDANTA SURY • Poem