ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౯౪-94) రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు! పలుకకు మదిలోఁ గోపించు రాజుఁ గొల్వకు పాపపు దేశంబు సొరకు!పదిలము సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఇది నిజము అని నిరూపణ ఐన తరువాత కూడా అబద్ధం చెప్పకూడదు. మనపై ఆత్మీయత, అభిమానం చూపే చుట్టాల గురించి తక్కువ చేసి మాట్లాడకు. తన మనసులో నన్ను కోపించే వ్యక్తి దగ్గర పని చేయకు. పాపాత్ములు, చెడ్డవారు వుండే దేశానికి నివసించడానికి వెళ్ళకు ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. *నిజంలో, నిజంతోనే సహజీవనం చేస్తూ మన పెంపు కోరుకునే చుట్టాలకు దగ్గరగా వుండాలి. చెడును, చూడకుండా, పెంచకుండా దూరంగా వుండాలి* అని భావం. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
August 15, 2020 • T. VEDANTA SURY • Poem