ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం (౯౭-97)
August 21, 2020 • T. VEDANTA SURY • Poem

వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల ! కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయి తనముఁ! బెట్టకు సుమతీ!
తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ...
ఈ ఇలాతలంలో వర్షాల వల్ల వరదలు వచ్చి చేను వరదతో నిండి నప్పుడు చేను దున్నకూడదు. నీకు కష్టాలు వచ్చి, సంపద పోయి నప్పుడు, చుట్టాల యింటికి వెళ్ళకు. నీ శతృవులకు నీ వ్యాపార, ఉద్యోగ రహస్యాలు చెప్పకు.  చేతకాని వానికి, పిరికి వానికి సైన్యాధిపత్యం, ఉద్యోగ బాధ్యతలు అప్పగించకు.....
..... అని సుమతీ శతకకారుని వాక్కు.
*వరద నిండిన చేను దుక్కి చేసినందువల్ల ప్రయోజనం వుండదు. కష్టం, శ్రమ మాత్రమే మిగులుతుంది.  చెడి చుట్టాల వద్దకు వెళ్ళకు అనే పెద్దల మాట, మరి చద్ది మూట కదా. మన రహస్యాలు శతృవులకు తెలిస్తే శల్య సారధ్యం జరిగే అవకాశం ఎక్కవగా వుంటుంది.  ఇక పనికి రాని వానికి, పిరికి వానికి ఆధిపత్యం ఇస్తే ఏమీ జరగదు.  కనుక అన్నివేళలా అప్రమత్తంగా వుండాలి* అని భావం.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss