ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం 61(౬౧) అప్పిచ్చువాఁడు వైద్యుడు నెప్పడు నెడ తెగక పారు నేరును ద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడికున్నట్టి యూరు సొరకుము సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఏ ఊరిలో ఐతే, మన అవసరానికి ధనాన్ని అప్పుగా ఇచ్చేవాడు, మన అనారోగ్యానికి మందు ఇచ్చే వైద్యుడు, మనకు మంచి చెడులు చెప్పడానికి ఒక పురోహితుడు (బ్రాహ్మణుడు), మన త్రాగు మరియు ఇతర అనేక అవసరాలు తీర్చడానికి సెలయేరు లాగా ఎల్లప్పుడూ పారుతూ ఉండే ఒక కాలువ వుంటాయో అటువంటి ఊరిలోనే మనుషులు వారి నివాసము ఏర్పరచు కోవాలి. పైన చెప్పిన ఒనరులు లేని ఊరులో నివాసం కాదు ఒక్క నిముషం నిలబడ కూడదు.... ...అని సుమతీ శతకకారుని వాక్కు. *నలుగురికి మంచి చేయాలని ఆలోచిస్తూ, అందుకోసం తపిస్తూ, ఆ దిశలోనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నవారితో, సమూహంతో మనం కూడా కలసి మెలసి వుంటే సమాజంతో పాటు మనకు కూడా మంచి జరుగుతుంది అని భావం.* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
June 26, 2020 • T. VEDANTA SURY • Poem