ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
సుమతీ శతకం పద్యం 63(౬౩) ఇచ్చునదె విద్య రణమునఁ జొచ్చునదె మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు వాదుకు వచ్చినదె కీడు సుమ్ము వసుధను సుమతీ తా.: ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో ధన సంపాదనకు ఉపయోగపడే చదువే చదువు. విపత్కర పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకోవడానికి వుపయోగపడేదే సరియైన మగతనము, పౌరుషము. చక్కని సరస్వతీ పుతృలైన కవులు మెచ్చుకొనేదే మంచి కవిత్వం. అవసరం లేకపోయినా మాట్లాడటం వల్ల వచ్చేదే వాగ్వివాదం. .... ...అని సుమతీ శతక కారుని వాక్కు. *మనం చదువుకునే విద్య మనకు జీవితాన్ని జీవించడం నేర్పుతూనే, మన జీవనం గడవడానికి చాలినంత ధనాన్ని కూడా చేకూర్చ గలగాలి. "వాడు మగాడ్రా! బుజ్జి" అనిపించుకుంటే సరిపోదు. మన పౌరుషం, మగతనం అవసరమైనప్పుడు మనతో పాటు నలుగురికి ఉపయోగ పడేలా వుండాలి. మనం నేర్చుకున్న విద్య పది మంది పెద్దవారు మెచ్చుకునేదిగా వుండాలి. అలాగే, మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వారితో అనవసరమైన వాదనలు రాకుండా మాట్లాడ గలగాలి అని భావం.* .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
June 26, 2020 • T. VEDANTA SURY • Poem